రెండో కోవిడ్ వేవ్ తలెత్తవచ్ఛు, మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే ఆందోళన

రాష్ట్రంలో సెకండ్ కోవిడ్-19 వేవ్ తలెత్తవచ్చునని మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే ఆందోళన వ్యక్తం చేశారు. ఎసింప్టోమాటిక్ లక్షణాలున్నవారిని ఇళ్లలోనే ఉండేందుకు అనుమతించినప్పటికీ వారు పట్టించుకోకుండా బయటకు ప్రజలవద్దకు..

రెండో కోవిడ్ వేవ్ తలెత్తవచ్ఛు, మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే ఆందోళన

Edited By:

Updated on: Sep 27, 2020 | 1:17 PM

రాష్ట్రంలో సెకండ్ కోవిడ్-19 వేవ్ తలెత్తవచ్చునని మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే ఆందోళన వ్యక్తం చేశారు. ఎసింప్టోమాటిక్ లక్షణాలున్నవారిని ఇళ్లలోనే ఉండేందుకు అనుమతించినప్పటికీ వారు పట్టించుకోకుండా బయటకు ప్రజలవద్దకు వఛ్చి కరోనా ఇన్ఫెక్షన్ సోకడానికి కారకులవుతున్నారని ఆయన చెప్పారు. వీరివల్ల కరోనా వైరస్ వ్యాపిస్తోందన్నారు. వీళ్ళు ఏ విధమైన ప్రికాషన్స్ పాటించకుండా తిరుగుతున్నారని, ఫలితంగా ఆరోగ్యవంతులు కూడా ఈ వైరస్ కి గురవుతున్నారని ఉధ్ధవ్ అన్నారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ట్రేసింగ్, టెస్టింగ్స్, పెరగాలని, ఇందుకు తాము చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ‘నా కుటుంబం, నా బాధ్యత’ అన్న కాన్సెప్ట్ ప్రతి వ్యక్తిలో కలగాలి అని ఆయన సూచించారు.

మహారాష్ట్రలో 13 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదు కాగా-ఇప్పటివరకు సుమారు 35 వేలమంది కరోనా రోగులు మృతి చెందారు.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us