Sahitya Akademi Jobs 2023: కేంద్ర సాహిత్య అకాడమీలో రూ. 2 లక్షలకుపైగా జీతంతో కొలువులు.. ఈ అర్హతలుంటే జాబ్ గ్యారెంటీ..

|

Jun 05, 2023 | 9:02 PM

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన న్యూఢిల్లీలోని సాహిత్య అకాడమీ (Sahitya Akademi).. 9 డిప్యూటీ సెక్రటరీ, సీనియర్‌ అకౌంటెంట్‌, పబ్లికేషన్‌ అసిస్టెంట్‌, ప్రోగ్రామ్‌ అసిస్టెంట్‌, స్టెనోగ్రాఫర్‌, ఎంటీఎస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

Sahitya Akademi Jobs 2023: కేంద్ర సాహిత్య అకాడమీలో రూ. 2 లక్షలకుపైగా జీతంతో కొలువులు.. ఈ అర్హతలుంటే జాబ్ గ్యారెంటీ..
Sahitya Akademi
Follow us on

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన న్యూఢిల్లీలోని సాహిత్య అకాడమీ (Sahitya Akademi).. 9 డిప్యూటీ సెక్రటరీ, సీనియర్‌ అకౌంటెంట్‌, పబ్లికేషన్‌ అసిస్టెంట్‌, ప్రోగ్రామ్‌ అసిస్టెంట్‌, స్టెనోగ్రాఫర్‌, ఎంటీఎస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పోస్టును బట్టి ఇంటర్మీడియట్/ సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ/ గ్రాడ్యుయేషన్‌/ పీజీ డిగ్రీ/ డాక్టరల్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో ఏడాది నుంచి ఐదేళ్ల అనుభవం ఉండాలి. దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 30 నుంచి 50 యేళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఆఫ్‌లైన్‌ విధానంలో నోటిఫికేషన్‌ విడుదలైన 30 రోజుల్లోపు (జూన్ 12, 2023వ తేదీలోపు) కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. రాతపరీక్ష/ స్కిల్‌టెస్ట్‌/ఇంటర్వ్యూ/అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.18,000ల నుంచి రూ.2,08,700ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్..

The Secretary, Sahitya Akademi, Rabindra Bhavan, 35 Ferozeshah Road, New Delhi-110001.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.