
ఈ భూమ్మీద ఉన్న అన్నింటికన్నా పవర్ఫుల్ టూల్ ఏదైనా ఉందా అంటే అది మన మైండ్ మాత్రమే. మనం కనిపెట్టిన అద్భుతమైన టెక్నాలజీ, కొత్త ఆవిష్కరణలు.. అన్నిటికీ ఈ మైండే కారణం. వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు ప్రజలకు గొప్ప సందేశాన్ని అందించారు. మనిషి జీవితంలో మనసు పోషించే కీలక పాత్రను ఈ సందేశం నొక్కి చెప్పింది. మనిషి మైండ్ ఈ భూమిపైనే అత్యంత శక్తివంతమైన, అసాధారణమైన సాధనంగా సద్గురు అభివర్ణించారు. దాన్ని సామర్థ్యం అపారం అని, అది మానవ చరిత్రలో అనేక అద్భుతాలను సృష్టించిందని తెలిపారు. మానవ మేధస్సుకు నిదర్శనంగా నిలిచిన అత్యంత ఆశ్చర్యకరమైన ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతి వెనుక ఉన్నది మన మనస్సేనని స్పష్టం చేశారు.
మైండ్ శక్తి కేవలం నిర్మాణాత్మకమైనది మాత్రమే కాదని సద్గురు హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్న అన్ని కలహాలు, సంఘర్షణలు, మానవతా సంక్షోభాలకు మనసే కారణమని ఆయన గుర్తుచేశారు. అంటే, మన మైండ్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో, దాన్ని సరిగ్గా మేనేజ్ చేయకపోతే అంతే డేంజర్ అని చెప్పారు. ఈ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నాడు ఈ అద్భుతమైన సాధనం అయిన మన మైండ్ బాధ్యతను మనం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.
మైండ్ శ్రేయస్సు అనేక అద్భుతాలను సృష్టించేందుకు దోహదపడుతుందని సద్గురు అన్నారు. ఈ దిశగా అడుగులు వేయడానికి ఆయన మనకు ఒక చిన్న ఛాలెంజ్ విసిరారు. మన మైండ్‌ను పక్కాగా, హ్యాపీగా ఉంచుకోవాలంటే.. రోజుకు కేవలం 7 నిమిషాలు కేటాయించాలని సూచించారు. అవును.. ఈ 7 నిమిషాలు మనకోసం మనం టైమ్ కేటాయిస్తే, మన మనస్సు హెల్తీగా ఉంటుంది. దానివల్ల మన లైఫ్ స్టైల్, మనం చేసే పనులు, మన చుట్టూ ఉన్న ప్రపంచం అన్నీ అద్భుతంగా మారతాయని సద్గురు చెప్పారు.
Our Mind is our business – our primary business. The human mind is the most powerful and phenomenal Tool on this planet. It has manifested itself in the most astonishing inventions and technological advances that have become a benchmark of human ingenuity. However, all the… pic.twitter.com/1m4rLMDjIP
— Sadhguru (@SadhguruJV) October 10, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..