ఎన్నార్సీ లిస్ట్.. యుఎస్ కమిటీ ఆందోళన.. ఇదెక్కడి జోక్యం ?

భారత దేశ వ్యాప్తంగా ఎన్నార్సీని అమలు చేస్తామని హోం మంత్రి అమిత్ షా బుధవారం పార్లమెంటులో ప్రకటించారు. అయితే ఏ మతానికి చెందినవారయినా ఆందోళన చెందవలసిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. అస్సాంలో మళ్ళీ ఈ ప్రక్రియ చేపడతామని కూడా ఆయన చెప్పారు. కానీ ఇండియాలో ప్రధాని మోదీ ప్రభుత్వం చేబడుతున్న ప్రధాన నిర్ణయాలపై ఓ కన్నేసి ఉంచిన అమెరికా.. అస్సాంలో గతంలో చేపట్టిన ఎన్నార్సీ విషయాన్ని సీరియస్ గా పరిగణించింది. ఆ రాష్ట్రంలో నిర్వహించిన ఈ […]

ఎన్నార్సీ లిస్ట్.. యుఎస్ కమిటీ ఆందోళన.. ఇదెక్కడి జోక్యం ?
Follow us

|

Updated on: Nov 20, 2019 | 8:38 PM

భారత దేశ వ్యాప్తంగా ఎన్నార్సీని అమలు చేస్తామని హోం మంత్రి అమిత్ షా బుధవారం పార్లమెంటులో ప్రకటించారు. అయితే ఏ మతానికి చెందినవారయినా ఆందోళన చెందవలసిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. అస్సాంలో మళ్ళీ ఈ ప్రక్రియ చేపడతామని కూడా ఆయన చెప్పారు. కానీ ఇండియాలో ప్రధాని మోదీ ప్రభుత్వం చేబడుతున్న ప్రధాన నిర్ణయాలపై ఓ కన్నేసి ఉంచిన అమెరికా.. అస్సాంలో గతంలో చేపట్టిన ఎన్నార్సీ విషయాన్ని సీరియస్ గా పరిగణించింది. ఆ రాష్ట్రంలో నిర్వహించిన ఈ ప్రక్రియను యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడమ్(యుఎస్ సీఐఆర్ఎఫ్) అనే పానెల్ దుయ్యబట్టింది. ఎన్నార్సీ పేరిట దాదాపు 20 లక్షల మంది అస్సాంవాసులు ఆ రాష్ట్రానికి చెందినవారు కాకపోతారని, సరైన, పారదర్శకమైన ప్రాసెస్ లేకుండా వారి పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నారని ఆరోపించింది. (అసలైన… జెన్యూన్ భారతీయ పౌరుల పేర్లతో కూడిన రిజిస్టర్ ను రూపొందించే ప్రక్రియే ఎన్నార్సీ.. అస్సాంలో 2013 లో సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు ఈ ప్రక్రియకు సంబంధించి రిజిస్టర్ ను అప్ డేట్ చేశారు. ఆ రాష్ట్రంలోని సుమారు మూడు కోట్లమందికి పైగా ప్రజలు తాము 1971 మార్చి 24 వ తేదీకి ముందే భారత్ వఛ్చి ఇక్కడి పౌరులమయ్యామని నిరూపించుకోవాల్సి ఉంటుంది.) గత ఆగస్టు 31 న అప్ డేట్ చేసిన ఫైనల్ ఎన్నార్సీని ప్రభుత్వం రిలీజ్ చేసిన సంగతి విదితమే.. అయితే ఆ జాబితాలో సుమారు 19 లక్షలమంది పేర్లను తొలగించారు. తాము భారతీయులమేనని వారు నిరూపించుకోలేకపోయారు. దీనిపై దృష్టి పెట్టిన అమెరికన్ పానెల్.. ముస్లిములు ఓటు వేసేందుకు అనర్హులుగా చేసి.వారిని .టార్గెట్ చేయడమే ఇందులోని ఉద్దేశమని, అందుకే ఈ ప్రక్రియను వినియోగించుకుంటున్నారని ఆరోపించింది. దాదాపు ఇరవై లక్షల మంది ఏ రాష్ట్రానీకీ చెందనివారు కాకుండా పోతారు. సరైన విధానమంటూ లేక చేబట్టిన ఈ ప్రాసెస్ కారణంగా వారి పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నారు అని ఈ కమిటీ కమిషనర్ అనురిమ భార్గవ పేర్కొన్నారు. అస్సాంలో ముస్లిములను తరిమివేసేందుకు, వారిని ఏకాకులను చేసేందుకుఈ విధానాన్ని భారతీయ ‘ రాజకీయ నేతలు ‘ మాటిమాటికీ వినియోగించుకుంటున్నారని, పైగా వారికి వేర్వేరు పౌరసత్వ ప్రమాణాలను అమలు చేయడానికి ఎన్నార్సీ పరిధిని విస్తృతపరచాలని భావిస్తున్నారని అన్నారు. గతవారం ఈ అంశంపై కాంగ్రెస్ కమిటీ ముందు ఆయన ఈ మేరకు స్టేట్ మెంట్ ఇచ్చారు. అటు-ఈ కమిటీ చైర్మన్ టోనీ పెర్కిన్స్ కూడా ఈ అభిప్రాయాలతో ఏకీభవించారు. భారత ప్రభుత్వం తన రాజ్యాంగం ప్రకారం అన్ని మైనారిటీ వర్గాల హక్కులను పరిరక్షించవలసిఉందన్నారు. అయితే ఎన్నార్సీ ని అప్ డేట్ చేయడమన్నది సుప్రీంకోర్టు నిర్ణయమని, ఆ కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం నడచుకుంటోందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అసలు డేటాకు సంబంధించి ఎన్నార్సీ ఫారం లో దరఖాస్తుదారుని మతం గురించిన కాలమ్ ఎక్కడా లేదని ఈ శాఖ పేర్కొంది. కాగా-భారత ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి అమెరికాకు హక్కు ఎక్కడిదని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

. ..

Latest Articles
పూరన్ పోరాటం వృథా.. పోరాడి ఓడిన లక్నో.. ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
పూరన్ పోరాటం వృథా.. పోరాడి ఓడిన లక్నో.. ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా..?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా..?
ఆసీస్ బీచుల్లో రష్మిక ఫొటో షూట్.. చూడ్డానికి రెండు కళ్లు చాలవంతే!
ఆసీస్ బీచుల్లో రష్మిక ఫొటో షూట్.. చూడ్డానికి రెండు కళ్లు చాలవంతే!
రసాయనాలు లేకుండా రెండ్రోజుల్లోనే పచ్చి అరటిగెల పండింది..?!ఎలాగంటే
రసాయనాలు లేకుండా రెండ్రోజుల్లోనే పచ్చి అరటిగెల పండింది..?!ఎలాగంటే
బాలీవుడ్‏లోకి తెలుగమ్మాయి.. ఊహించని పాత్రలో అనన్య..
బాలీవుడ్‏లోకి తెలుగమ్మాయి.. ఊహించని పాత్రలో అనన్య..
ఒక నెల రోజుల పాటు అన్నం తినకపోతే ఏమవుతుందో తెలుసా..?
ఒక నెల రోజుల పాటు అన్నం తినకపోతే ఏమవుతుందో తెలుసా..?
అదరగొట్టిన అభిషేక్.. ఆఖరులో స్టబ్స్ మెరుపులు.. ఢిల్లీ భారీ స్కోరు
అదరగొట్టిన అభిషేక్.. ఆఖరులో స్టబ్స్ మెరుపులు.. ఢిల్లీ భారీ స్కోరు
ఒక్కసారి కట్టిన చీరను మళ్లీ ముట్టని హీరోయిన్..
ఒక్కసారి కట్టిన చీరను మళ్లీ ముట్టని హీరోయిన్..
లక్నో ఓనర్ ఇంట్లో కేఎల్ రాహుల్‌ డిన్నర్.. అతియా శెట్టి ఏమందంటే?
లక్నో ఓనర్ ఇంట్లో కేఎల్ రాహుల్‌ డిన్నర్.. అతియా శెట్టి ఏమందంటే?
రాత్రి మిగిలిన చపాతీ పడేస్తున్నారా..?లాభాలు తెలిస్తేఆశ్చర్యపోతారు
రాత్రి మిగిలిన చపాతీ పడేస్తున్నారా..?లాభాలు తెలిస్తేఆశ్చర్యపోతారు