Bride in Helicopter: హెలికాఫ్టర్‌లో అత్తింటికి కొత్త కోడలు.. చూసేందుకు ఎగబడిన జనం.. ఎక్కడంటే..

|

Dec 17, 2021 | 10:29 AM

Bride in Helicopter: పుట్టింటిని వదిలి తమ ఇంట కోడలిగా అడుగు పెట్టబోతున్న నూతన వధువును అత్తింటివారు ఘనంగా ఆహ్వానించాలనుకున్నారు. తమ ఇంటి మహలక్ష్మిని..

Bride in Helicopter: హెలికాఫ్టర్‌లో అత్తింటికి కొత్త కోడలు.. చూసేందుకు ఎగబడిన జనం.. ఎక్కడంటే..
Bride In Helicopter
Follow us on

Bride in Helicopter: పుట్టింటిని వదిలి తమ ఇంట కోడలిగా అడుగు పెట్టబోతున్న నూతన వధువును అత్తింటివారు ఘనంగా ఆహ్వానించాలనుకున్నారు. తమ ఇంటి మహలక్ష్మిని తెచ్చుకునేందుకు ఏకంగా లక్ష రూపాయలు ఖర్చుచేసి ఓ హెలికాఫ్టర్‌ను అద్దెకు తీసుకుని మరీ వెళ్లి కోడలిని ఇంటికి తెచ్చుకున్నారు. తొలిసారి మెంటిట్లో అడుగుపెట్టబోతున్న ఆ కోడలికి జీవితాంతం మర్చిపోలేని మధుర జ్ఞాపకాన్ని పంచినది ఆ కుటుంబం. ఈ అరుదైన ఘటన రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో జరిగింది.

భారత్ , పాకిస్థాన్ సరిహద్దు సమీపంలోని బిధానియన్‌కి ధనీలో తరుణ్ మేఘవాల్‌ అనే వ్యక్తికి డిసెంబర్‌ 14 రాత్రి దియాతో వివాహమైంది. పెళ్లి తంతు ముగిసిన తర్వాత వారిద్దరూ హెలికాప్టర్‌లో బార్మర్ నగరంలోని జసేధార్ ధామ్‌కి చేరుకున్నారు. వధూవరులిద్దరూ హెలికాప్టర్‌లో గ్రామానికి వస్తున్న విషయం తెలిసిన గ్రామస్థులు వధూవరులను చూసేందుకు ఆ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తొలిసారి మెట్టింటికి వస్తున్న కోడలిని హెలికాప్టర్‌లో తీసుకురావాలన్నది వరుడి కుటుంబం కల. దానిని ఇలా తీర్చుకున్నారు. అయితే, అదేమంత సులభంగా సాధ్యం కాలేదు. తొలుత మాట్లాడుకున్న హెలికాప్టర్ చివరి నిమిషంలో సాధ్యం కాదని చేతులెత్తేసింది. దీంతో అదనంగా మరో లక్ష రూపాయలు చెల్లించి ఇంకో హెలికాప్టర్‌ను మాట్లాడుకున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. తమ కోడలిని హెలికాఫ్టర్‌లో తెచ్చుకున్న ఈ కుటుంబం సంపన్నకుటుంబం కూడా కాదు.. ఒక సామాన్య దళిత కుటుంబం. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

Also Read:  తన యజమాని కారు పార్కింగ్ చేస్తుంటే.. కుక్క ఇచ్చిన డైరెక్షన్స్‌కు నెటిజన్లు ఫిదా.. మీరు కూడా ఓ లుక్ వేయండి మరి..