Rahul Gandhi Comments: కాంగ్రెస్ నుంచి బీజేపీకి వలస వెళ్లిన నేతలపై ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ను ఎదుర్కొనేందుకు భయపడే వారు కాంగ్రెస్‌ను వీడాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బీజేపీని, ఆర్ఎస్ఎస్‌ను చూసి భయపడేవారే ఆ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. భయం లేని వారు ఎవరొచ్చినా తమ పార్టీలోకి ఆహ్వానిస్తామని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా రాహుల్ పేర్కొన్నారు. శుక్రవారం కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగంలోని దాదాపు 3,500 మంది కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. బీజేపీకి భయపడే వారు ఇంకా ఎవరైనా ఉంటే.. తమ పార్టీ నుంచి స్వేచ్ఛగా వెళ్లిపోవచ్చని సూచించారు. ధైర్యవంతులే కాంగ్రెస్‌కు అవసరమని, అలాంటి వారు తమ పార్టీలోకి రావాలని పిలుపు నిచ్చారు.
ఈ సందర్భంగా పార్టీ నుంచి బీజేపీలో చేరిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై రాహుల్ విమర్శలు చేశారు. సింధియా కూడా అలాగే వెళ్లారని తెలిపారు. తన రాజ భవనాన్ని, సంపదను కాపాడుకోలేనన్న భయంతోనే సింధియా ఆర్ఎస్ఎస్ లో చేరారని ఆరోపించారు. అబద్ధాలను ప్రచారం చేయడమే బీజేపీ విధానమని ఆరోపించారు. అలాంటి వాటిని ధైర్యంగా ప్రశ్నించాలని సూచించారు. తనతో మాట్లాడేందుకు ఎప్పుడూ జంకొద్దని పార్టీ సోషల్ మీడియా సభ్యులకు రాహుల్ పలు సూచనలు చేశారు.
Also Read: