Chakka Jam on February 6: ఈనెల 6తేదీన దేశవ్యాప్తంగా రైతులు చక్కా జామ్.. బడ్జెట్ కేటాయింపులతో మాకు పనిలేదు

రిపబ్లిక్ డే రోజున రైతుల ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే.. అయితే కేంద్రం సాగు చట్టాలను వెనక్కి తీసుకునే వరకూ తమ ఆందోళన విరమించేంది లేదని రైతు సంఘాలు తెల్చి చెప్పాయి..

Chakka Jam on February 6: ఈనెల 6తేదీన దేశవ్యాప్తంగా రైతులు చక్కా జామ్.. బడ్జెట్ కేటాయింపులతో మాకు పనిలేదు
Follow us

|

Updated on: Feb 02, 2021 | 9:02 AM

Chakka Jam on February 6:కేంద్ర ప్రభుతం ప్రవేశ పెట్టిన సాగు చట్టాలను రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా రైతులు చేస్తున్నారు. రిపబ్లిక్ డే రోజున రైతుల ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే.. అయితే కేంద్రం సాగు చట్టాలను వెనక్కి తీసుకునే వరకూ తమ ఆందోళన విరమించేంది లేదని రైతు సంఘాలు తెల్చి చెప్పాయి, తాజాగా మరో ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఈనెల 6తేదీన దేశవ్యాప్తంగా రాస్తారోకో (చక్కా జామ్) నిర్వహించాలని నిర్ణయించారు. ఆ రోజున జాతీయ, రాష్ట్ర రహదారులను మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటలపాటు దిగ్భంధం చేయనున్నామని రైతుల సంఘాలు ప్రకటించాయి.

కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి జరిగిన కేటాయింపులతో తమకు సంబంధం లేదని, తాము కోరుకుంటున్నది సాగు చట్టాల రద్దేనని రైతు నేత రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు.  ఢిల్లీ సరిహద్దుల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో బడ్జెట్ విషయాల గురించి తమకు ఎటువంటి సమాచారం లేదని పేర్కొన్నారు. పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర గురించి ప్రభుత్వం మాట్లాడడం లేదని, తాము ప్రధానితో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ రుణ లక్ష్యాన్ని పెంచినంత మాత్రాన ప్రయోజనం లేదని, రైతుల ఆదాయాన్ని పెంచే చర్యలు చేపట్టాలని గ్రామీణ్ కిసాన్ మజ్దూర్ సమితి నేత రంజీత్ రాజు. కేంద్ర వార్షిక బడ్జెట్‌లో రైతులను పట్టించుకోలేదనీ, సాగు రంగానికి కేటాయింపులను తగ్గించి వేసిందని స్వరాజ్‌ అభియాన్‌ నేత యోగేంద్ర యాదవ్‌ విమర్శించారు. మరోవైపు ఢిల్లీ సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను కట్టడి చేసేందుకు యంత్రాంగం పక్కా ఏర్పాట్లు చేపడుతోంది.

Also Read:

సమాధి నుంచి మృత దేహాన్నివెలికి తీసి సంవత్సరీకం జరిపే గ్రామం..