Watch Video: లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ.. ఓటు వేసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు..

దేశంలో తొలి విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. తొలి విడతలో 21 రాష్ట్రాల్లోని 102 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. పలువురు నేతలు ఇప్పటికే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Watch Video: లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ.. ఓటు వేసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు..
Lok Sabha Elections
Follow us

|

Updated on: Apr 19, 2024 | 10:11 AM

దేశంలో తొలి విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. తొలి విడతలో 21 రాష్ట్రాల్లోని 102 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. పలువురు నేతలు ఇప్పటికే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం స్టాలిన్, తమిళనాడు సౌత్‎లో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై, సేలంలో పళనిస్వామి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పి చిదంబరం శివగంగ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. మాజీ ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వం, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో పాటు పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సినీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా ఓటు వేశారు. రజినీకాంత్, కుష్బూ, కార్తీక్‌, అజిత్‌, శివకార్తీకేయన్‌ ఉదయాన్నే వచ్చి తమ ఓటు వేశారు. పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఓ గంట ముందుగానే పోలింగ్‌ ముగియనున్నట్లు తెలిపారు ఎన్నికల అధికారులు. గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు చాలా తేడాలు ఉన్నాయి. ప్రస్తుతం తమిళనాడులో త్రిముఖపోరు నెలకొంది. డీఎంకే, ఏడీఎంకే, బీజేపీ కూటముల మధ్య హోరా హోరీ పోరు కొనసాగుతోంది.

రాజస్తాన్‌లోనూ పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియను ప్రారంభించారు ఎన్నికల అధికారులు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు క్యూ లైన్లలో నిల్చున్నారు. రాజస్తాన్‌ సీఎం భజనలాల్‌ శర్మ తనకు కేటాయించిన పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక మధ్యప్రదేశ్‎లో కూడా లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ పర్వం కొనసాగుతోంది. మాజీ సీఎం కమల్‌నాథ్‌ ఓటు హక్కు వినియోగించుకోగా ఆయన కుమారుడు, కాంగ్రెస్ నేత నకుల్ నాథ్ చింద్వారా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. చింద్వారాలో పోలింగ్‌ కొనసాగుతోంది. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ఉదయాన్నే వచ్చి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు ఓటర్లు. దీంతో మధ్యాహ్నం సమయానికే మంచి పోలింగ్ శాతం నెలకొనే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..