
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా కొన్ని వీడియోలను పంచుకున్నారు. మహిళా సాధికారతకతకు తమ ప్రభుత్వం చేసిన కృషి, అమలు చేస్తున్న పలు పథకాల గురించి ప్రధాని వివరించారు. ఇందులో భాగంగా మొత్తం నాలుగు పథకాలకు సంబంధించిన వీడియోలను షేర్ చేశారు..
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎమ్ అవాస్ యోజన పథకం గురించి వివరించి రూపొందిచిన వీడియోను షేర్ చేసిన ప్రధాని. ‘ఇల్లు గౌరవానికి పునాది. ఇక్కడే సాధికారత ప్రారంభమవుతుంది, కలలు నిజమవుతాయి. మహిళల సాధికారకతకు పీఎం ఆవాస్ యోజన ఒక గేమ్ ఛేంజర్’ అని రాసుకొచ్చారు.
మహిళల ఆర్థిక భద్రతకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లఖపతి దీదీ యోజన పథకానికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన ప్రధాని.. ‘దేశవ్యాప్తంగా మహిళల సాధికారత కోసం లఖపతి దీదీ యోజన ఒక ప్రధాన మాధ్యమంగా మారుతోంది. స్వయం సహాయక సంఘాలతో అనుబంధం ఉన్న మన తల్లులు, సోదరీమణులు, కుమార్తెలు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో బలమైన పాత్ర పోషిస్తున్నారు’ అంటూ రాసుకొచ్చారు.
ఇక కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న మరో పథకం పీఎం స్వానిధి యోజన గురించి వివరిస్తూ.. ‘
పీఎం స్వానిధి యోజన పేద కార్మికుల జీవితాల్లో కొత్త ఆనందాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం లబ్ధిదారుల్లో పెద్ద సంఖ్యలో మన మన తల్లులు, సోదరీమణులు ఉన్నారని’ రాసుకొచ్చారు.
ఆధునిక మహిళల సాధికారకతకు నిదర్శనంలా తీసుకొచ్చిన నమో డ్రోన్ దీదీస్ పథకం గురించి వివరిస్తూ.. ‘మహిళా సాధారికత కోసం తమ ప్రభుత్వం డ్రోన్ల శక్తిని ఉపయోగిస్తోంది. ఈ ఆవిష్కరణ మహిళల స్వీయ విశ్వాసాన్ని పెంచుతుంది’ అని మోదీ రాసుకొచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..