PM Modi Birthday: ‘నా ఫ్రెండ్‌ పుతిన్‌కు ధన్యావాదాలు..’ ఆసక్తికరంగా పుతిన్‌, మోదీ సంభాషణ

75వ పుట్టిన రోజు సందర్భంగా రాష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. మాస్కో - న్యూఢిల్లీ మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రధాని మోదీ చేసిన వ్యక్తిగత సహకారాన్ని పుతిన్‌ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇక పుతిన్ శుభాకాంక్షలకు మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు..

PM Modi Birthday: నా ఫ్రెండ్‌ పుతిన్‌కు ధన్యావాదాలు.. ఆసక్తికరంగా పుతిన్‌, మోదీ సంభాషణ
PM Modi thanks Putin for birthday call

Updated on: Sep 17, 2025 | 6:54 PM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: ప్రధాని మోదీ 75వ పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖుల శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో రాష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కూడా మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. మాస్కో – న్యూఢిల్లీ మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రధాని మోదీ చేసిన వ్యక్తిగత సహకారాన్ని పుతిన్‌ ప్రత్యేకంగా ప్రశంసించారు. ‘డియర్‌ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, దయచేసి మీ 75వ పుట్టినరోజు సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలను స్వీకరించండి’ అని పుతిన్ క్రెమ్లిన్ వెబ్‌సైట్‌లో పోస్టు పెట్టారు. భారత్, రష్యా మధ్య ప్రత్యేక విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించడం పట్ల మోదీ నిబద్ధతను ఆ పోస్టులో కొనియాడారు.

ఇక పుతిన్‌ మెసేజ్‌కు ప్రధాని మోదీ సైతం ఎక్స్ వేదికగా స్పందించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పుట్టినరోజు శుభాకాంక్షలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్‌ మీడియా వేదికగా బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. మాస్కోతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి భారత్‌ నిబద్ధతను పునరుద్ఘాటించారు.’నా 75వ పుట్టినరోజు సందర్భంగా ఫోన్ కాల్ చేసి శుభాకాంక్షలు తెలిపినందుకు నా మిత్రుడు, అధ్యక్షుడు పుతిన్‌కు ధన్యవాదాలు. మా ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మేం కట్టుబడి ఉన్నాం. ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం భారత్‌ అన్ని విధాలుగా సహకారం అందించడానికి సిద్ధంగా ఉంది’ అని మోదీ ట్వీట్‌ చేశారు. మోదీ, పుతీన్‌ల పరస్పర పలకరింపులు రెండు దేశాల మధ్య ఉన్న లోతైన బంధాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

కాగా గత నెలలో చైనాలోని టియాంజిన్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) శిఖరాగ్ర సమావేశంలో పుతిన్, మోదీ చివరిసారిగా కలుసుకున్నారు. బుధవారం 75వ పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రధాని మోడీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, యుకె మాజీ ప్రధాని రిషి సునక్ సహా అనేక మంది ప్రపంచ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.