PM Narendra Modi: గుజరాత్‌ ప్రజల ఆకాంక్ష అదే.. కీలక వీడియోను షేర్‌ చేసిన ప్రధాని మోడీ..

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. 182 స్థానాలున్న గుజరాత్‌ అసెంబ్లీకి ఇప్పటికే 89 స్థానాల్లో మొదటి దశ పోలింగ్‌ పూర్తయింది. సోమవారం (డిసెంబర్‌ 5వ తేదీన) రెండోదశ పోలింగ్‌ జరగనుంది.

PM Narendra Modi: గుజరాత్‌ ప్రజల ఆకాంక్ష అదే.. కీలక వీడియోను షేర్‌ చేసిన ప్రధాని మోడీ..
Pm Modi
Follow us

|

Updated on: Dec 03, 2022 | 5:52 PM

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. 182 స్థానాలున్న గుజరాత్‌ అసెంబ్లీకి ఇప్పటికే 89 స్థానాల్లో మొదటి దశ పోలింగ్‌ పూర్తయింది. సోమవారం (డిసెంబర్‌ 5వ తేదీన) రెండోదశ పోలింగ్‌ జరగనుంది. 93 స్థానాల్లో ఓటింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి. శనివారంతో రెండో దశ ప్రచారం సైతం ముగిసింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీల మధ్య ముక్కోణపు పోరు జరుగుతోంది. బీజేపీ మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తుండగా.. దానికి అడ్డుకట్టే వేసేందుకు కాంగ్రెస్, ఆప్ ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో వరుసగా 7వ సారి అధికారం దక్కించుకునేందుకు బీజేపీతో ముమ్మర ప్రయత్నాలు చేసింది. దీనికోసం స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రంగంలోకి దిగారు. సొంత రాష్ట్రంలో పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చి.. 2024 ఎన్నికల్లో మరోసారి కషాయ జెండా ఎగురవేసేందుకు ప్రధాని మోడీ సన్నాహాలు ప్రారంభించారు. ఈ మేరకు రాష్ట్రంలో వరుస పర్యటనలు చేస్తూ.. బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని తీసుకువచ్చారు. అంతేకాకుండా ప్రధాని మోడీ చేపట్టిన ఎన్నికల ర్యాలీల్లో లక్షలాది మంది ప్రజలు పాల్గొని.. ఆయన ప్రణాళికలకు సైతం స్వాగతించారు. గుజరాత్‌ మోడల్‌ నమూనాతో ప్రజల అభిమానాన్ని ఇప్పటికే సొంతం చేసుకున్న ప్రధాని మోడీ.. అభివృద్ధి కోసం పట్టంకట్టాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో అన్ని సాధ్యమంటూ ప్రధాని మోడీ ప్రజలకు వివరించారు. దీంతోపాటు.. కాంగ్రెస్‌, ఆప్‌ ఉచ్చులో పడొద్దంటూ ప్రజలకు హితవు పలికారు. వారు చేసింది.. శూన్యమంటూ తనదైన శైలిలో ప్రచారం చేశారు. అంతేకాకుండా.. గుజరాత్‌ ప్రజల అభిమానంతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని.. ప్రజా తీర్పు ఈ సారి మరింత ఉత్సాహాన్నిచ్చేలా ఉంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. రికార్డు స్థాయిలో సీట్లను కైవసం చేసుకుని అధికారాన్ని చేపడుతామని ధీమా వ్యక్తంచేశారు.

ఇవి కూడా చదవండి

అయితే, గుజరాత్‌లో రెండో విడత ప్రచారం ముగిసిన సందర్భంగా ప్రధాని మోడీ ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా పలు విషయాలను కూడా క్యాప్షన్‌లో రాశారు. గత కొన్ని రోజులుగా తాను గుజరాత్ అంతటా ప్రయాణించానని.. తాను ఎక్కడికి వెళ్లినా విపరీతమైన అభిమానం లభించిందంటూ పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాల తాము చేసిన అభివృద్ధిని ప్రజలు చూశారని, ఇదే బాటలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారని ప్రధాని మోడీ.. వీడియోను పోస్ట్‌ చేశారు.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం..

దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ