G7 Summit 2024: జీ7 సదస్సులో అపురూప దృశ్యం.. ప్రధాని మోడీ, పోప్ ఫ్రాన్సిస్‌ ఆలింగనం..

శుక్రవారం జరిగిన G7 సమ్మిట్ లో ఔట్‌రీచ్ సెషన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ.. పోప్ ఫ్రాన్సిస్‌లు కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. అనంతరం సదస్సులో ఉన్న ఇతర ప్రపంచ నాయకులతో కలిసి ప్రపంచ సమస్యలపై ప్రధాని మోడీ చర్చించారు. 87 ఏళ్ల కాథలిక్ చర్చి అధినేత పోప్ ఫ్రాన్సిస్‌ వీల్ చైర్ లో బోర్గో ఎగ్నాజియా శిఖరాగ్ర వేదిక వద్ద చేరుకున్నారు. ఈ సమయంలో అక్కడ ఉన్న ప్రపంచ నాయకులను పలకరించడానికి టేబుల్ చుట్టూ ఉన్న నేతలను పలకరించడానికి వీల్‌ఛైర్‌లో  పోప్ అనుచరులు తీసుకుని వెళ్ళారు.

G7 Summit 2024: జీ7 సదస్సులో అపురూప దృశ్యం.. ప్రధాని మోడీ, పోప్ ఫ్రాన్సిస్‌ ఆలింగనం..
Pm Modi Pope Francis Meet
Follow us

|

Updated on: Jun 14, 2024 | 9:54 PM

దక్షిణ ఇటలీలోని అపులియాలో జరుగుతున్న జీ7 దేశాల సదస్సులో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సదస్సుకు వచ్చిన పలు ప్రపంచ దేశాధినేతలతో ప్రధాని మోడీ భేటీ అవుతూ బిజిబిజిగా గడుపుతున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ సమవేశంలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. శుక్రవారం జరిగిన G7 సమ్మిట్ లో ఔట్‌రీచ్ సెషన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ.. పోప్ ఫ్రాన్సిస్‌లు కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. అనంతరం సదస్సులో ఉన్న ఇతర ప్రపంచ నాయకులతో కలిసి ప్రపంచ సమస్యలపై ప్రధాని మోడీ చర్చించారు.

ప్రసంగంలో ఏమి చెప్పారంటే

87 ఏళ్ల కాథలిక్ చర్చి అధినేత పోప్ ఫ్రాన్సిస్‌ వీల్ చైర్ లో బోర్గో ఎగ్నాజియా శిఖరాగ్ర వేదిక వద్ద చేరుకున్నారు. ఈ సమయంలో అక్కడ ఉన్న ప్రపంచ నాయకులను పలకరించడానికి టేబుల్ చుట్టూ ఉన్న నేతలను పలకరించడానికి వీల్‌ఛైర్‌లో  పోప్ అనుచరులు తీసుకుని వెళ్ళారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ పోప్ ఫ్రాన్సిస్‌ కలుసుకున్నారు. ఒకరితోనొకరు మాట్లాడుతూ కనిపించారు. ఈ సమవేశంలో ఔట్‌రీచ్ సెషన్‌లో పోప్ ఫ్రాన్సిస్‌ మాట్లాడుతూ “AIని సద్వినియోగం చేసుకోవడం మనలో ప్రతి ఒక్కరిపై ఉంది” అని G7, ఇతర నాయకులు పాల్గొన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎనర్జీ, ఆఫ్రికా, మెడిటరేనియన్ వంటి అనేక అంశాలకు గురించి ప్రస్తావించారు.

ఆత్మీయ కలయిక

ఈ సంవత్సరం శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షురాలిగా ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోనిచే గ్లోబల్ సౌత్‌ను ఆహ్వానించారు. హోలీ ఫాదర్ కు ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా నమస్కారం చేశారు. వీల్‌చైర్‌లో ఉన్న ఆక్టోజెనేరియన్‌తో కలి.. US ప్రెసిడెంట్ జో బిడెన్, బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునక్ , ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌లతో సహా వివిధ దేశాల నాయకులను పలకరించారు. ఈ సందర్భంగా ఒకరినొకరు హ్యాండ్‌షేక్‌ ఇచ్చుకుని ఆత్మీయంగా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.

2021లో పోప్ ని కలిసిన ప్రధాని మోడీ

అయితే ప్రధాని మోడీ అక్టోబరు 2021లో వాటికన్‌ సిటీ అపోస్టోలిక్ ప్యాలెస్‌లో జరిగిన ఒక ప్రైవేట్ పార్టీలో పోప్ ఫ్రాన్సిస్‌ను కలిసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఇరువురు కరోనా వైరస్ మహమ్మారి.. దీని వలన ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పడే భాదలు.. పర్యవసానాలపై చర్చించారు. వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సవాళ్లపైనా కూడా ప్రధాని మోడీ, పోప్ చర్చించిన సంగతి తెలిసిందే. అంతేకాదు వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో భారతదేశం తీసుకున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాల గురించి అలాగే ఒక బిలియన్ కోవిడ్-19 వ్యక్సిన్స్ ను ప్రపంచ దేశాలకు అందించడంలో భారతదేశం పాత్ర.. మన దేశం సాధించిన విజయాల గురించి ప్రధాన మంత్రి పోప్‌కు వివరించారు. మహమ్మారి సమయంలో అవసరమైన దేశాలకు భారతదేశం చేసిన సహాయాన్ని పోప్ ఫ్రాన్సిస్‌ ప్రశంసించారు.

వచ్చే ఏడాది భారత్ లో పర్యటన?

PMO ప్రకారం భారతదేశం.. హోలీ సిటీ వాటికన్ లోని కాథలిక్ చర్చితో స్నేహ పూర్వక సంబంధాలు కలిగి ఉన్నాయి. 1948లో దౌత్య సంబంధాలు మొదలైనప్పటి నుంచి స్నేహపూర్వక వాతావరణం కొనసాగుతుందని తెలుస్తోంది. ఆసియాలో రెండవ అతిపెద్ద కాథలిక్ జనాభాకు నిలయం భారతదేశం అన్న సంగతి తెలిసిందే.. అయితే వచ్చే ఏడాది మన దేశంలో పోప్ ఫ్రాన్సిస్‌ సందర్శించనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
అందాల పోటీల్లో ముందున్న ‘జారా’.. జారాది కళ్లు.. చెదిరే అందం.!
అందాల పోటీల్లో ముందున్న ‘జారా’.. జారాది కళ్లు.. చెదిరే అందం.!
పేరుకు కేంద్ర మంత్రి.. ఒక్క పదం రాయడం రాదట! ఓ లెవెల్‌లో ట్రోలింగ్
పేరుకు కేంద్ర మంత్రి.. ఒక్క పదం రాయడం రాదట! ఓ లెవెల్‌లో ట్రోలింగ్
ఎర్ర సముద్రంలో అరాచకం.. హౌతీ రెబెల్స్‌ మరో నౌకను ముంచేసారు.
ఎర్ర సముద్రంలో అరాచకం.. హౌతీ రెబెల్స్‌ మరో నౌకను ముంచేసారు.
రూ.10 వేలు పెట్టుబడి పెట్టి..రూ.10 కోట్లకు అధిపతులయ్యారు.!
రూ.10 వేలు పెట్టుబడి పెట్టి..రూ.10 కోట్లకు అధిపతులయ్యారు.!
షాకింగ్ ఘటన.. ఆలూ చిప్స్‌ ప్యాకెట్‌లో కుళ్లిన కప్ప.. వీడియో.
షాకింగ్ ఘటన.. ఆలూ చిప్స్‌ ప్యాకెట్‌లో కుళ్లిన కప్ప.. వీడియో.
స్నానానికి వెళ్లి బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా వల్ల మృతి.
స్నానానికి వెళ్లి బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా వల్ల మృతి.
దేశం దాటేందుకు వేషం మార్చ యువకుడి విఫలయత్నం.. చివరికి.?
దేశం దాటేందుకు వేషం మార్చ యువకుడి విఫలయత్నం.. చివరికి.?
చేయి తెగి రక్తమోడుతున్నా పట్టించుకోలేదు.. చివరికి ఏమైందంటే.!
చేయి తెగి రక్తమోడుతున్నా పట్టించుకోలేదు.. చివరికి ఏమైందంటే.!
టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే విమానంలో మంటలు..! వీడియో వైరల్..
టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే విమానంలో మంటలు..! వీడియో వైరల్..
చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక డెడ్ బాడీ..! వీడియో చూస్తే షాకే..
చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక డెడ్ బాడీ..! వీడియో చూస్తే షాకే..