ఈ భారతీయులకు మాత్రమే బ్రిటన్‌లో ఓటు వేసే అవకాశం..!

TV9 Telugu

30 May 2024

జూలై 4న బ్రిటన్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తాజాగా ఈ విషయాన్ని ప్రకటించారు.

బ్రిటన్‌లో ఈ ఏడాది 4 కోట్ల 70 లక్షల మంది ఓటర్లు ఫొటో ఐడీ ద్వారా ఓటు వేయనున్నారు. బ్రిటిష్ ఎన్నికల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి.

బ్రిటన్‌లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 6 నెలలుగా అక్కడ నివసిస్తున్న భారతీయులకు కూడా ఓటు వేసే అవకాశం లభించనుంది.

బ్రిటన్‌లో వర్క్ వీసాపై ఉన్న విద్యార్థులు, ఇతర భారతీయులు కూడా జూలై 4న జరగనున్న ఓటింగ్‌లో పాల్గొనగలరు.

భారతదేశం బ్రిటిష్ కామన్వెల్త్‌లో సభ్య దేశంగా ఉన్నందున భారతీయులు బ్రిటన్‌లో ఓటు వేసే అవకాశాన్ని పొందుతున్నారు.

ఇప్పటి వరకు బ్రిటన్‌లో భారత్‌లో ఉన్నట్టు ఫొటో ఐడీ కార్డు లేదు. దీని కోసం రిషి సునక్ ప్రభుత్వం చట్టం చేసింది.

ముందస్తు ఎన్నికల ప్రకటన కారణంగా ఓటరు ID తయారు చేయడం సాధ్యం కాలేదు. అందుకకే మరో విధానాన్ని ఎంచుకుంది బ్రిటన్ ప్రభుత్వం.

దీని కోసం పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలతో ఓటింగ్ జరుగుతుంది. బ్రిటన్ లో నివస్తున్న భారతీయులకు ఇది వర్తిస్తుంది.