సముద్రంలో అంతుచిక్కని వ్యాధి.. ప్రమాదంలో మానవాళి? 

10 June 2024

TV9 Telugu

Pic credit - getty

ప్రపంచంలోని మూడింట ఒక వంతు సముద్రం చుట్టూ ఉంది. అదే సమయంలో సముద్రంలో రకరకాల జీవరాశులు జీవిస్తాయి. అంతేకాదు కొంతమంది జీవితం సముద్రం మీద ఆధారపడి ఉంటుంది.

సముద్రం

ప్రాణాంతక మహమ్మారి మహాసముద్రాలలో సముద్ర జీవులను నిశ్శబ్దంగా నాశనం చేస్తోంది. దీనిని నివారించడం శాస్త్రవేత్తల వల్ల కూడా కాదు అనేది తెలిసి భయపడాల్సిన విషయమే.

భయపడాల్సిన విషయం

ఈ మహమ్మారి ఇప్పుడు హిందూ మహాసముద్రం వరకు వ్యాపించిందని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. పరిశోధన ప్రకారం సముద్రంలో ఒక అంటువ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది. సముద్రపు అర్చిన్‌లను నాశనం చేస్తుంది.

సముద్రపు అర్చిన్‌ 

ఈ అంటువ్యాధి క్రమంగా ఎర్ర సముద్రం దాటి హిందూ మహాసముద్రం వైపు కదులుతోంది. ఇది సముద్రంలో వ్యాపించడం వల్ల మనుషుల ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు

ప్రాణాలకు కూడా ప్రమాదం 

సముద్రపు అర్చిన్ ఒక రకమైన జీవి.. ఈ జీవి చిన్నగా, గుండ్రంగా, ముళ్ళతో ఉంటుంది. ఇది సముద్ర పర్యావరణ వ్యవస్థను నిర్వహించడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

సముద్రపు అర్చిన్ అంటే ఏమిటి 

పరిశోధకుల ప్రకారం ఈ మహమ్మారి రెండు వారాల్లో 70 కిలోమీటర్ల వరకు వ్యాపించింది. ఈ మహమ్మారి మొదటిసారిగా ఏడాది క్రితం గల్ఫ్ ఆఫ్ అకాబాలో కనిపించింది.

వేగంగా వ్యాప్తి