సరస్సులో నుంచి బయటపడ్డ పెట్టె.. నిండా నోట్ల కట్టలే..

TV9 Telugu

04 June 2024

న్యూయార్క్ కు చెందిన ఓ జంటకు మాగ్నెట్ ఫిషింగ్ చేయడం సరదా. పొరపాటున నీటిలో పడిపోయిన వస్తువులను వెలికి తీసేందుకు చేసే ప్రయత్నమే మాగ్నెట్ ఫిషింగ్.

ఈ ప్రయత్నంలో విలువైన వాచీలు, ఫోన్లు, ఇనుప పెట్టెలు నీటి అడుగు నుంచి బయటపడుతుంటాయి. వాటిని ప్రభుత్వానికి అందిస్తారు.

కేన్, అగొస్తిని జంట కరోనా కాలం నుంచి ఇలా మాగ్నెట్ ఫిషింగ్ చేస్తున్నారు.  చేపల వేటలాగే ఓ గేలానికి చివర బలమైన అయస్కాంతాన్ని కట్టి నీటి అడుగున గాలిస్తుంటారు.

ఆ అయస్కాంతానికి అతుక్కున్న ఇనుప వస్తువులను వెలికి తీసుకుంటారు. ఇప్పటివరకు చాల వస్తువులను వెతికి పట్టుకున్నారు.

తాజాగా ఆ జంటకు ఓ ఇనుప పెట్టె దొరికింది. అందులో వంద డాలర్ల నోట్లు ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు.

ఇనుప పెట్టెను తెరిచి చూడగా నీటిలో తడిచి పాడైపోయిన వంద డాలర్ల నోట్లు ఉన్నాయి. వాటి విలువ లక్ష డాలర్లకు పైనే ఉండొచ్చని అంచనా.

దాని యజమానిని గుర్తించే చిహ్నాల కోసం గాలించారు. ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో ఆ పెట్టెను కేన్, అగొస్తిని జంటకే తిరిగిచ్చేశారు.

న్యూయార్క్ లో అమలవుతున్న చట్టాల ప్రకారం.. దొరికిన వస్తువు యజమానిని గుర్తించలేని పక్షంలో ఆ వస్తువు ఎవరికైతే దొరుకుతుందో వారికే సొంతమవుతుంది.