అకస్మాత్తుగా రంగు మారిన అలాస్కా నది..!

TV9 Telugu

01 June 2024

విటమిన్ బి12 లేకపోవడం వల్ల శరీరంలో బలహీనత ఏర్పడుతుంది. అలాస్కా అంతటా నదులు, ప్రవాహాలు నారింజ రంగులోకి మారుతుంది. తాజాగా దీనికి కారణం తెలిపారు శాస్త్రవేత్తలు., ఆందోళన కూడా శరీరాన్ని బలహీనం చేస్తాయి.

దీనిపై కొన్నేళ్ళుగా పరిశోధకులు కొనసాగిస్తున్నారు. కొత్త పరిశోధనలు వాతావరణ మార్పులను సమాధానంగా సూచిస్తున్నాయి.

గేట్స్ ఆఫ్ ఆర్కిటిక్, కోబుక్ వ్యాలీ జాతీయ ఉద్యానవనాలతో సహా ఫెడరల్ భూములలో ప్రభావితమైన నీరు ఉందని పరిశోధకులు తెలిపారు.

అలాస్కాలోని నదుల నీరు తెలుపు , నీలం నుండి నారింజ రంగులోకి మారింది. భూమి శాశ్వత మంచు కరగడం వల్ల ఇది సంభవిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

దీంతో భూమి నుంచి విష లోహాలు బయటకు వస్తున్నాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ అమెరికా, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా సంయుక్తంగా ఈ సర్వేను నిర్వహించాయి.

దేశంలోని 75 జలమార్గాలపై ఈ సర్వే నిర్వహించారు. ఐరన్, జింక్, నికెల్ మరియు సీసం కారణంగా నీటి రంగు మురికిగా మారుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఈ నదులు చాలా వరకు పర్యావరణ వ్యవస్థకు అనుకూలంగా లేవు. ఇక్కడి ఆర్కిటిక్ నేలలోని శాశ్వత మంచులో కార్బన్, పోషకాలు మరియు లోహాలు ఉంటాయి.

పరిశోధన ప్రకారం, ఆర్కిటిక్ నాలుగు రెట్లు వేగంగా వేడెక్కుతోంది.  శాశ్వత మంచు ప్రక్రియ భూమి ధ్రువ ప్రాంతాలలో ఎక్కువగా జరుగుతుంది.