PM Modi: రామయ్య విగ్రహ ప్రతిష్ట వేళ ప్రధాని కీలక ప్రకటన.. కొత్త పథకం..

ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మోదీ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. ఈ విషయమై ప్రధాని ట్వీట్ చేస్తూ.. 'అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తర్వాత, కోటి ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం ప్రధాన మంత్రి సూర్యోదయ యోజనను...

PM Modi: రామయ్య విగ్రహ ప్రతిష్ట వేళ ప్రధాని కీలక ప్రకటన.. కొత్త పథకం..
Pm Modi

Updated on: Jan 22, 2024 | 7:07 PM

వందల ఏళ్ల స్వప్నం సాకారమైన శుభ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ కీలక ప్రకటన చేశారు. దేశంలో ఎంతో మంది పేదలకు మేలు చేసే విధంగా కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అయోధ్యలో బాల రాముడి విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ట చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌ వేదికగా కొత్త పథకానికి సంబంధించి ప్రకటన చేశారు.

ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మోదీ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. ఈ విషయమై ప్రధాని ట్వీట్ చేస్తూ.. ‘అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తర్వాత, కోటి ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం ప్రధాన మంత్రి సూర్యోదయ యోజనను ప్రారంభిస్తోంది. రామయ్య ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత తీసుకున్న మొదటి నిర్ణయం’ ఇదేనంటూ రాసుకొచ్చారు.

పీఎం సూర్యోదయ యోజన పథకంపై మోదీ ట్వీట్..

ఇక అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట జరిగిన శుభ సందర్భంగా ప్రతీ ఒక్కరూ వారి ఇంటి పైకప్పులపై వారి స్వంత సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్‌ను కలిగి ఉండాలనే నా సంకల్పం మరింత బలపడింన్నారు. ఈ విషయమై ప్రధాని మాట్లాడుతూ.. అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తర్వాత, కోటి ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేసే లక్ష్యంతో మా ప్రభుత్వం ‘ప్రధాని మంత్రి సూర్యోదయ యోజన’ని ప్రారంభించే దిశగా నిర్ణయం తీసుకుంది. ఈ పథకం పేద, మధ్యతరగతి ప్రజల విద్యుత్ బిల్లును తగ్గించడమే కాకుండా, ఇంధన రంగంలో దేశాన్ని స్వావలంబనగా చేస్తుందని మోదీ చెప్పుకొచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..