Delhi Riots 2020: ‘ప్లీజ్ ! శాంతి, సామరస్యాలను కాపాడండి’.. ఢిల్లీవాసులకు మోదీ పిలుపు

నగరంలో శాంతి, సౌభ్రాత్రాలు వెల్లి  విరిసేలా చూడాలని, శాంతి, సామరస్యాలే మన దేశ ప్రథమ సూత్రాలని ఆయన ట్వీట్ చేశారు.

Delhi Riots 2020: 'ప్లీజ్ ! శాంతి, సామరస్యాలను కాపాడండి'.. ఢిల్లీవాసులకు మోదీ పిలుపు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 26, 2020 | 3:52 PM

ఢిల్లీలో నాలుగు రోజులుగా చెలరేగుతున్న  అల్లర్లు, ఘర్షణలపై ప్రధాని మోదీ మొదటిసారిగా బుధవారం స్పందించారు . నగరంలో శాంతి, సౌభ్రాత్రాలు వెల్లి  విరిసేలా చూడాలని, శాంతి, సామరస్యాలే మన దేశ ప్రథమ సూత్రాలని ఆయన ట్వీట్ చేశారు. ఢిల్లీలోని పరిస్థితులపై తాను  సెక్యూరిటీ వ్యవహారాలపై పై గల కేబినెట్ కమిటీ సమావేశంలో సమీక్షించానని తెలిపిన ఆయన.. సాధారణ పరిస్థితి నెలకొనేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. కాగా- ఢిల్లీ హింసాకాండలో మరణించిన వారి సంఖ్య 21 కి పెరిగింది. ఈ ఉదయం భజన పుర ప్రాంతంలో ఆందోళనకారులు ఓ బ్యాటరీ షాపునకు నిప్పు పెట్టారు. షాపులో కాలిపోయిన బ్యాటరీలను వీధిలో చెల్లా చెదురుగా విసిరివేశారు.

Latest Articles