ఢిల్లీ మెట్రోలో ఏం జరుగుతుందో అంతుచిక్కటం లేదు.. ఒకవైపు కొందరు ముద్దులు పెట్టుకుంటే.. మరోవైపు కొందరు పిడిగుద్దులు కొట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే, ఇటీవల ఓ యువతి ఢిల్లీ మెట్రోలోనే హెయిర్ స్ట్రెయిట్నింగ్ చేసి వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలోనే ఢిల్లీ మెట్రో మరో సంచలనానికి తెరతీసింది. మద్యం ప్రియులకు ఢిల్లీ మెట్రో శుభవార్త అందించింది. ఇప్పుడు మెట్రోలో రెండు సీలు చేసిన మద్యం బాటిళ్లను తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చింది. డీఎంఆర్‌సీ, సీఐఎస్‌ఎఫ్ అధికారులతో కూడిన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఢిల్లీ మెట్రోలో మద్యం బాటిళ్లను తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. అయితే ఇప్పుడు ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్ నిబంధనల ప్రకారం.. ఢిల్లీ మెట్రోలో ఒక వ్యక్తికి రెండు సీల్డ్ మద్యం బాటిళ్లను తీసుకెళ్లడానికి అనుమతి ఉందని ఢిల్లీ మెట్రో తెలిపింది.
నిబంధనల ప్రకారం, ఢిల్లీ మెట్రోలో ఇప్పుడు ఒక వ్యక్తికి రెండు సీలు చేసిన మద్యం బాటిళ్లను తీసుకెళ్లేందుకు అనుమతి ఉందని ఢిల్లీ మెట్రో అధికారికంగా తెలియజేసింది. CISF, DMRC అధికారుల కమిటీ గతంలో ఇచ్చిన ఆర్డర్‌ను సమీక్షించింది. మునుపటి ఆర్డర్ ప్రకారం, మెట్రో ప్రాంగణంలో మద్యం సేవించడం పూర్తిగా నిషేధించబడింది. మెట్రో ప్రయాణికులు మద్యం బాటిళ్లను తీసుకెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా ప్రయాణికుడు మద్యం మత్తులో దురుసుగా ప్రవర్తించినట్లు తేలితే, సంబంధిత చట్ట నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని DMRC తెలిపింది. ఇటీవలి వరకు ఎయిర్‌పోర్ట్ లైన్ మినహా అన్ని మెట్రో మార్గాల్లో మద్యం బాటిళ్లను తీసుకెళ్లడంపై నిషేధం ఉంది.
ఇకపోతే.. ఢిల్లీ మెట్రోలో ఏవైనా పదునైన వస్తువులు, పేలుడు పదార్థాలు, పనిముట్లు, మండే పదార్థాలు, రసాయనాలు, ఇతర ప్రమాదకర పదార్థాలు, తుపాకీలు, తుపాకీలు, ఇతర ప్రమాదకర వస్తువులు ఇప్పటి వరకు ఢిల్లీ మెట్రోలో నిషేధంలో ఉన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..