Viral: ఒరేయ్.. ఇదేంట్రా.. ఎయిర్‌పోర్ట్ ఓ ప్రయాణికుడి సూట్‌కేస్ చెక్ చేయగా.. మూటల్లో

దిగ్భ్రాంతికరమైన ఘటన ఇది. థాయ్‌ ఎయిర్‌ ఏషియా విమానం బ్యాంకాక్‌ నుంచి బెంగళూరు కెంపేగౌడ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చింది. అందులో నుంచి ఓ మధ్యవయసు వ్యక్తి దిగాడు. కాస్త అనుమానాస్పదంగా కనిపించాడు. అధికారులు అతడి లగేజ్ స్కాన్ చేసి కంగుతిన్నారు.

Viral: ఒరేయ్.. ఇదేంట్రా.. ఎయిర్‌పోర్ట్ ఓ ప్రయాణికుడి సూట్‌కేస్ చెక్ చేయగా.. మూటల్లో
Customs At Kempegowda
Follow us

|

Updated on: Apr 23, 2024 | 1:53 PM

థాయ్‌ ఎయిర్‌ ఏషియా విమానంలో బ్యాంకాక్‌ నుంచి బెంగళూరుకు ఓ ప్యాసింజర్ చేరుకున్నాడు. చూడ్డానికి టిప్ టాప్‌గా క్లాస్‌గా ఉన్నాడు. అయితే అతని లగేజ్ బ్యాగేజ్ చెక్ చేసిన కస్టమ్స్ అధికారులు కంగుతిన్నారు. అందులో ఏకంగా 10 అనకొండ పిల్లలు ఉన్నాయి. అందులో ఊపిరాడక 3 చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. వన్య ప్రాణుల అక్రమ రవాణా చేసేందుకు యత్నించిన సకలేష్‌పూర్‌కు చెందిన 56 ఏళ్ల కాఫీ వ్యాపారిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 20వ తేదీ రాత్రి 10.44 గంటలకు ఎఫ్‌డి-137 విమానంలో నిందితుడు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నట్లు తెలిపారు.

మార్కెట్లో బేబీ ఎల్లో అనకొండ విలువ రూ.40,000 నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది. స్వాధీనం చేసుకున్న అనకొండ పిల్లలు 2 అడుగుల నుంచి 2.5 అడుగుల మధ్య ఉన్నాయి.  కాటన్ బ్యాగ్‌లలో చుట్టి చెక్-ఇన్ బ్యాగేజీలో ఉంచారు. ఈజీగా డబ్బు సంపాదించాలనే ఆశతో నిందితుడు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. “బ్యాంకాక్‌ ఎయిర్‌పోర్టులో ఓ వ్యక్తి.. అతడిని సంప్రదించి బెంగళూరులో సదరు సూట్‌కేస్‌ను అందజేస్తే రూ. 20 వేలు ఇస్తానని హామీ ఇచ్చాడు. దీంతో అతను చేయడానికి అంగీకరించాడు” అని కస్టమ్స్ అధికారి తెలిపారు.  స్మగ్లింగ్ గురించి ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్‌కు ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్ కూడా అందింది. బ్యాగేజీని స్కానింగ్‌ చేస్తున్నప్పుడు పాములను గుర్తించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..