
దేశ అత్యున్నత చట్టసభ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. సోమవారం నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఆఖిలపక్షమ సమావేశం నిర్వహించేందుకు సిద్దమైంది కేంద్ర ప్రభుత్వం. అటు ప్రతిపక్షాలు సైతం ఈ సమావేశంలో కీలక విషయాలను ప్రస్థావించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన నీట్ పేపర్ లీక్ వ్యవహారం, ఈ సంఘటనకు వ్యతిరేకంగా ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నీరాహార దీక్ష, ఆయన్న బలవంతంగా హాస్పిటల్‌కు తరలించే అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది.
దీనితో పాటు అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం వ్యవహారం కూడా ఈ సమావేశంలో హాట్ టాపిక్‌గా మారనుంది. ఈ అంశంపై సమాజ్‌వాదీ పార్టీ (SP) ఇప్పటికే స్పందిస్తూ, రామాలయ విరాళాల అవకతవకలపై పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలను అడ్డుకుంటామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ల సమక్షంలో జరగనున్న ఈ సమావేశంలో ఈ అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.
పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న కొత్త బిల్లులు ఇవే:
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.