నింగి నేల.. ఆధిపత్యం మనదే..! దాయాది దాస్తున్నదేంటి? దాగిన నిజాలేంటి?

మనకంటూ ఓ క్లారిటీ ఉంది. సోషల్‌ మీడియాలో వచ్చిన ప్రతిదీ నమ్మడానికి వీల్లేదు అని. అందుకే కాబోలు.. పాకిస్తాన్‌ రూట్‌ మార్చింది. చైనానే స్వయంగా చెప్పింది అన్నట్టుగా చెప్పిస్తే ఎలా ఉంటుందని ఆలోచించింది. అలా ఏకంగా.. మన S-400పైనే విష ప్రచారాలు చేయించింది. ఇదొక్కటే కాదు.. ఎన్నెన్ని ఫేక్‌ వార్తలో..!

నింగి నేల.. ఆధిపత్యం మనదే..! దాయాది దాస్తున్నదేంటి? దాగిన నిజాలేంటి?
Fact Sheet

Updated on: May 10, 2025 | 11:50 PM

విష్ణుమూర్తి సుదర్శన చక్రం ఏనాడైనా విఫలమైందా? లేదు కదా..! మరి అలాంటి అస్త్రం అయిన S-400ను ధ్వంసం చేశారంటే ఎలా నమ్ముతాం. ‘అత్యంత విశ్వసనీయ, ప్రభుత్వం ధృవీకరించిన వార్తలనే ఇవ్వండి, వాటినే నమ్మండి’ అంటూ వరుస అడ్వయిజరీలు విడుదల చేస్తూ వస్తోంది భారత ప్రభుత్వం. వాస్తవాలనే నమ్మండంటోంది. పాకిస్తాన్‌ చేస్తున్న ఫేక్‌ ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతోంది. మనకంటూ ఓ క్లారిటీ ఉంది. సోషల్‌ మీడియాలో వచ్చిన ప్రతిదీ నమ్మడానికి వీల్లేదు అని. అందుకే కాబోలు.. పాకిస్తాన్‌ రూట్‌ మార్చింది. చైనానే స్వయంగా చెప్పింది అన్నట్టుగా చెప్పిస్తే ఎలా ఉంటుందని ఆలోచించింది. అలా ఏకంగా.. మన S-400పైనే విష ప్రచారాలు చేయించింది. ఇదొక్కటే కాదు.. ఎన్నెన్ని ఫేక్‌ వార్తలో..! మరి వాటిలో నిజాలేంటి? అసలు ప్రచారంలో ఉన్న ఫేక్‌ వీడియోలేంటి? తెలుసుకుందాం. ఎలాగూ పాకిస్తాన్ చెప్పేది మనం వినం. నమ్మం కూడా. ఎవరైనా యుద్ధమంటే ఆయుధాలతో చేస్తారు. అదేంటో పాకిస్తాన్‌ మాత్రం ఫేక్‌ వీడియోలతో యుద్ధం చేస్తానంటోంది. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చాలా చక్కటి మాటన్నారు పాకిస్తాన్‌ను ఉద్దేశించి. దేశ ప్రజలు భారత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తారని, కేంద్రం తీవ్ర ఒత్తిడిలో ఉందని భ్రమించేలా పాక్‌ ఆర్మీ ప్రతినిధులు సంతోషంగా కనిపిస్తున్నారని చెప్పుకొచ్చారు. అక్కడి వారికి ఎందుకా ధీమా అంటే.. ఫేక్‌ వీడియోలను తెగ వదులుతోంది కాబట్టి. ఈ వార్త చూడండొకసారి. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో స్క్వాడ్రన్‌ లీడర్‌ అయిన పైలట్ శివానీ...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి