IND vs PAK: యుద్ధానికి కాలుదువ్విన పాక్.. భారత్‌పై విషం చిమ్ముతూ, కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్మీ చీఫ్..

Pakistan Army: పాకిస్థాన్ సాయుధ బలగాలు తమ మాతృభూమిలోని ప్రతి అంగుళాన్ని రక్షించుకోవడానికి మాత్రమే కాకుండా శత్రువులకు తగిన సమాధానం చెప్పేందుకు కూడా సిద్ధంగా ఉంటాయంటూ జనరల్ అసిమ్ మునీర్ చెప్పుకొచ్చారు.

IND vs PAK: యుద్ధానికి కాలుదువ్విన పాక్.. భారత్‌పై విషం చిమ్ముతూ, కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్మీ చీఫ్..
Pakistani Army Chief Asim Munir
Follow us

|

Updated on: Dec 04, 2022 | 6:05 AM

తమ దేశంపై దాడి జరిగితే, పాక్ సాయుధ బలగాలు తమ మాతృభూమిలోని ప్రతి అంగుళాన్ని కాపాడుకోవడమే కాకుండా శత్రు దేశానికి తగిన సమాధానం ఇస్తాయని పాకిస్థాన్ కొత్తగా నియమితులైన ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జనరల్ మునీర్ శనివారం తొలిసారిగా నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ)ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రాఖ్‌చిక్రి సెక్టార్‌లో మోహరించిన పాక్‌ సైనికులతో సమావేశమయ్యారు.

గిల్గిత్ బాల్టిస్థాన్, జమ్మూ కాశ్మీర్‌పై భారత నాయకత్వం చాలా బాధ్యతారహితమైన ప్రకటనలను ఇటీవల విన్నామని జనరల్ అసీమ్ మునీర్ అన్నారు. మా మాతృభూమిలోని ప్రతి అంగుళాన్ని రక్షించడానికి మాత్రమే కాకుండా, మాపై దాడి చేస్తే శత్రువులకు తగిన సమాధానం ఇవ్వడానికి కూడా పాకిస్తాన్ సాయుధ దళాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయని ప్రకటించారు.

పాక్ సైనికులు, అధికారులపై ప్రశంసలు..

జనరల్ కమర్ జావేద్ బజ్వా స్థానంలో జనరల్ మునీర్ నవంబర్ 24న నియమితులయ్యారు. బజ్వా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌గా ఆరేళ్లపాటు పనిచేసిన తర్వాత పదవీ విరమణ చేశారు. సరిహద్దు ప్రాంతాల పర్యటన సందర్భంగా, నియంత్రణ రేఖ వెంబడి తాజా పరిస్థితులు, పాకిస్థాన్ సైన్యం కార్యాచరణ సంసిద్ధత గురించి జనరల్ మునీర్‌కు వివరించారు. అదే సమయంలో, పాకిస్తాన్ సైనికులు, అధికారులు సవాలుతో కూడిన పరిస్థితులలో వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ తమ విధులను నిర్వహిస్తున్నారని మునీర్ ప్రశంసించారు.

ఇవి కూడా చదవండి

ఉపేంద్ర ద్వివేది ఇటీవల ప్రకటనపై..

కొత్తగా నియమితులైన ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ భారత సైన్యం‎ ఉత్తర సైన్యానికి చెందిన కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇటీవల చేసిన ప్రకటనను ప్రస్తావించారు. ఇందులో ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏ ఆదేశాన్ని ఇచ్చినా భారత సైన్యం నెరవేరుస్తుందని చెప్పుకొచ్చారు.

సైన్యం తగిన సమాధానం ఇస్తుందంటూ కీలక వ్యాఖ్యలు..

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించకుండా చూసేందుకు సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని, అది రెండు దేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఎప్పుడైనా విచ్ఛిన్నమైతే, మేం వారికి తగిన సమాధానం ఇస్తామని ఆయన ప్రకటించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)ని వెనక్కి తీసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నొక్కి చెబుతూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఉపేంద్ర ద్వివేది ఈ ప్రకటన చేశారు.

Latest Articles
పరశురాముడి గండ్రగొడ్డలి పాతిన ప్రదేశం తంగినాథ్ ధామ్ ఎక్కడ ఉందంటే
పరశురాముడి గండ్రగొడ్డలి పాతిన ప్రదేశం తంగినాథ్ ధామ్ ఎక్కడ ఉందంటే
నేటితో ముగియనున్న ప్రచారం.. పార్టీలు, అభ్యర్థులకు ఈసీ కీలక సూచనలు
నేటితో ముగియనున్న ప్రచారం.. పార్టీలు, అభ్యర్థులకు ఈసీ కీలక సూచనలు
17 ఏళ్ల తర్వాత పసికూనపై ఓడిన పాకిస్తాన్..
17 ఏళ్ల తర్వాత పసికూనపై ఓడిన పాకిస్తాన్..
బాబాయ్ కోసం రంగంలోకి అబ్బాయ్.. పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం
బాబాయ్ కోసం రంగంలోకి అబ్బాయ్.. పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం
ముంబైతో ఢీ కొట్టేందుకు కోల్‌కతా రెడీ.. గెలిస్తే ప్లే ఆఫ్స్ పక్కా
ముంబైతో ఢీ కొట్టేందుకు కోల్‌కతా రెడీ.. గెలిస్తే ప్లే ఆఫ్స్ పక్కా
కుప్పం నీదా.. నాదా.. చంద్రబాబు గెలుపుపై టీడీపీలో టెన్షన్..
కుప్పం నీదా.. నాదా.. చంద్రబాబు గెలుపుపై టీడీపీలో టెన్షన్..
చార్‌ధామ్ యాత్రకి IRCTC స్పెషల్ ప్యాకేజీ 12 రోజుల టూర్‌డీటైల్స్
చార్‌ధామ్ యాత్రకి IRCTC స్పెషల్ ప్యాకేజీ 12 రోజుల టూర్‌డీటైల్స్
మారిపోయిన స్నేహా ఉల్లాల్.. కొత్త ఫోటో వైరల్
మారిపోయిన స్నేహా ఉల్లాల్.. కొత్త ఫోటో వైరల్
అదా శర్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..
అదా శర్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..
నేటితో ప్రచారానికి తెర.. ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు సిద్దమైన నేతలు
నేటితో ప్రచారానికి తెర.. ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు సిద్దమైన నేతలు
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!