పూంచ్‌ జిల్లాలో పాక్ సైన్యం కాల్పులు..

పాకిస్థాన్‌ మరోసారి తన వక్రబుద్దిని ప్రదర్శిస్తోంది. గత కొద్ది రోజులుగా నిత్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. సరిహద్దు వెంట మోర్టార్‌ షెల్స్‌తో కాల్పులకు తెగబడుతోంది. తాజాగా.. బుధవారం తెల్లవారు..

పూంచ్‌ జిల్లాలో పాక్ సైన్యం కాల్పులు..
Follow us

| Edited By:

Updated on: Jul 08, 2020 | 6:57 AM

పాకిస్థాన్‌ మరోసారి తన వక్రబుద్దిని ప్రదర్శిస్తోంది. గత కొద్ది రోజులుగా నిత్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. సరిహద్దు వెంట మోర్టార్‌ షెల్స్‌తో కాల్పులకు తెగబడుతోంది. తాజాగా.. బుధవారం తెల్లవారు జామున 2.00 గంటల ప్రాంతంలో కాల్పులకు దిగింది. పూంచ్‌ జిల్లాలోని బాలాకోట్, మెంధర్‌ సెక్టార్‌ల మీదుగా కాల్పులు చేసింది. దాదాపు గంట సేపు పాక్ సైన్యం కాల్పులు చేపట్టింది. అప్రమత్తమైన భారత సైన్యం.. పాకిస్థాన్‌కు ధీటుగా ఎదురు కాల్పులు చేపట్టింది. దీంతో గంట తర్వాత తోక ముడిచింది. ఈ విషయాన్ని భారత ఆర్మీ అధికారులు తెలిపారు.

కాగా, గత కొద్ది రోజులుగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల్ని మన దేశంలోకి చొప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఓ వైపు ఉగ్రవాదుల్ని చోప్పిస్తూ.. మరో వైపు కాల్పులకు దిగుతోంది. ఉగ్రవాదులు చొరబడేందుకే.. సైన్యం దృష్టి మరల్చేందుకు పాక్ సైన్యం కాల్పులకు దిగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి.