దేశంలోనే బిగ్గెస్ట్ డిబేట్. తెలుగు టీవీ జర్నలిజం చరిత్రలోనే తొలిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో 5 ఎడిటర్స్ రౌండ్‌టేబుల్. సీనియర్ జర్నలిస్ట్, టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్, భారత ప్రధానమంత్రి మోదీని ఇంటర్వ్యూ చేశారు. ఈ ముఖాముఖిలో మోదీ కూడా ఆసక్తికర సమాధానాలు చెప్పారు. 5ఎడిటర్స్ విత్ ప్రధానమంత్రి కార్యక్రమం ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది.
ఇప్పటివరకు తెలుగు టీవీ తెరపై చూడని కాంబినేషన్ ఇది.. తెలుగు ప్రజల గొంతుకై.. ప్రధానిపై ప్రశ్నల వర్షం కురిపించిన సందర్భం. టీవీ9తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్.. ప్రధాని మోదీతో రౌండ్‌టేబుల్ ఇంటర్వ్యూ. తెలుగు రాష్ట్రాల జర్నలిజంలో మరో పాత్ బ్రేకింగ్ ఇంటర్వ్యూ. దాదాపు గంటపాటు సాగిన ఈ 5 ఎడిటర్స్ కార్యక్రమంలో అనేక ప్రశ్నలు సంధించారు టీవీ9 5 ఎడిటర్స్. ఇక తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేకంగా చర్చించారు ప్రధాని. టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్.. ప్రధాని మోదీ నుంచి సంచలనాత్మక సమాధానాలు రాబట్టారు.
ఇండియాలోనే బిగ్గెస్ట్ నెట్‌వర్క్… కంట్రీలోనే బిగ్గెస్ట్ జర్నలిస్ట్స్… టోటల్ నేషనల్ మీడియాలోనే బిగ్గెస్ట్ షో… ప్రధాని నరేంద్రమోదీతో టీవీ9 నెట్‌వర్క్ చేసిన ఇంటర్వ్యూ ఇప్పుడు దేశంలో ట్రెండింగ్ అవుతోంది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇంటర్వ్యూకు సంబందించి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.
An extensive interview in an interesting format! Do watch the interview with TV9 Network starting 8 PM this evening. You can watch it in 7 languages too. https://t.co/I4UHK7xb64
— Narendra Modi (@narendramodi) May 2, 2024
ఏపీలో బీజేపీ పార్టీ.. టీడీపీ, జనసేనతో పొత్తులోకి ఎందుకు వెళ్లింది? ఏపీలో ఎవరు గెలుస్తారని మోదీ అనుకుంటున్నారు? అంటూ ఏపీ రాజకీయాలపై ప్రశ్నించారు. దీనికి ప్రధాని కూడా ఆసక్తికర సమాధానాలు చెప్పారు.
ఇక తెలంగాణ సెంట్రిక్‌గానూ ఇంటర్వ్యూ సాగింది. సీఎం రేవంత్ తనను పెద్దన్న అనడాన్ని మోదీ ఎలా చూస్తున్నారు? అంతేకాదు ప్రస్తుత రేవంత్ పాలనపై ప్రధాని రేటింగ్ ఏంటి? RR ట్యాక్స్ అంటూ రేవంత్‌ను ఆరోపించిన మోదీ.. చెప్పిన సీక్రెట్స్ ఏంటి? ఇలా తెలుగు రాష్ట్రాల సమకాలీన రాజకీయాలపై ప్రధాని ఏం స్పందించారో.. ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రసారం అయ్యే 5 ఎడిటర్స్‌లో తెలుస్తుంది.
దేశంలోని బిగ్గెస్ట్ జర్నలిస్టులు.. టాప్ మోస్ట్ పొలిటీషియన్‌కు సంధించిన ప్రశ్నలు.. ఆయన ఇచ్చిన సమాధానాలు.. మొత్తానికి ఈ రౌండ్‌టేబుల్ కార్యక్రమం పాత్ బ్రేకింగ్‌గా మారబోతోంది. ఇక తెలుగు జర్నలిజం ట్రాక్ రికార్డులో.. ప్రధాని మోదీతో తొలిసారి ఇంటర్వ్యూ చేసిన తొలి జర్నలిస్టుగా రజినీకాంత్ నిలుస్తున్నారు. ఆయన సంధించిన ప్రశ్నలు.. ప్రధాని చెప్పిన సమాధానాలను ఈరోజు రాత్రి 8 గంటలకు చూడండి..!
TV9 ग्रुप के पांच संपादकों के साथ प्रधानमंत्री @NarendraModi का राउंड टेबल इंटरव्यू
जल्द ही सिर्फ #TV9Bharatvarsh पर #PMModiOnTV9 | #LokSabhaElections2024 | @nishantchat pic.twitter.com/YFecV1dJxd
— TV9 Bharatvarsh (@TV9Bharatvarsh) May 1, 2024
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…