చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు ఓ ఎమ్మెల్యే(MLA). 58వ ఏట పదో తరగతి పరీక్షలు రాసి.. తన దీర్ఘకాల కలను నెరవేర్చుకున్నారు. చదువుకు వయసుతో సంబంధం లేదు. సాధించాలనే సంకల్పం ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించవచ్చు. అని నిరూపించారు ఒడిశాలోని(Odisha) ఓ ఎమ్మెల్యే. 58 ఏళ్ల వయసులో తోటి విద్యార్థులతో కలిసి పదో తరగతి(Tenth Class Exams) పరీక్షలు రాశారు. ఎగ్జామ్ రాసేందుకు ముందు భయపడ్డా.. కుటుంబసభ్యులు, ప్రజల ప్రోత్సాహంతో రాయగలిగానని ఆ ఎమ్మెల్యే చెప్పారు. ఒడిశా రాష్ట్రంలోని ఫుల్బానీకి చెందిన బీజేడీ ఎమ్మెల్యే అంగద కన్హర్ పదో తరగతి పరీక్ష రాశారు. 1980లో చదువు ఆపేసిన కన్హర్.. ఆ తర్వాత రాజకీయాల్లో రంగప్రవేశం చేశారు. అప్పటి నుంచి పదో తరగతి పూర్తి చేయాలని భావించేవారు. ఇదే సమయంలో బోర్డ్ ఆఫ్సెకండరీ ఎడ్యుకేషన్నిర్వహిస్తున్న హైస్కూల్వార్షిక పరీక్షలకు ఆయన శుక్రవారం హాజరయ్యారు. కంధమాల్ జిల్లా పితాబరి గ్రామంలోని రుజంగీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో పరీక్ష రాశారు. ఆయన 67 మంది విద్యార్థులతో కలిసి ఎగ్జా్మ్ రాయడం విశేషం. ఎమ్మెల్యే హాజరు దృష్ట్యా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కుటుంబ సమస్యల కారణంగా పాఠశాల వయసులో పదో తరగతి పరీక్షకు హాజరు కాలేకపోయానని కన్హర్ అన్నారు. 1980లోనే తన చదువును ఆపేయాల్సి వచ్చిందని.. కానీ ఏళ్లు గడిచేకొద్దీ తన తోటి వారు, తన కంటే పెద్దవారు ఎంతో కష్టపడి చదువులు పూర్తిచేశారని చెప్పారు. సాధించాలనే సంకల్పం ఉంటే ఏ వయసులోనైనా చదువును పూర్తి చేయవచ్చని గుర్తించి.. పదో తరగతి పరీక్ష రాసినట్లు వెల్లడించారు. ఏ నాటికైనా పదో తరగతి పూర్తి చేగాలనేది తన కోరిక అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పరీక్ష రాసేందుకు ముందు కాస్త భయపడినా.. కుటుంబసభ్యులు, స్నేహితులు, గ్రామ ప్రజల ప్రోత్సాహంతో రాయగలిగానన్నారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి