Supreme Court: సుప్రీంకోర్టు చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం.. పూర్తి వివరాలు

|

Aug 31, 2021 | 11:32 AM

భారతదేశ అత్యున్నత న్యాయస్థానం చరిత్రలో అద్భుతఘట్టం ఇవాళ ఆవిష్కృతమైంది. మొదటిసారి ఒకేసారి తొమ్మిది మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు

Supreme Court: సుప్రీంకోర్టు చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం.. పూర్తి వివరాలు
Suprem Court Judges
Follow us on

SC judges: భారతదేశ అత్యున్నత న్యాయస్థానం చరిత్రలో అద్భుతఘట్టం ఇవాళ ఆవిష్కృతమైంది. మొదటిసారి ఒకేసారి తొమ్మిది మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కొంచెం సేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. న్యాయమూర్తులచేత సీజేఐ జస్టిస్ ఎన్ వి రమణ ప్రమాణ స్వీకారం చేయించారు. కరోనా ప్రభావం వల్ల ఒకటో నెంబర్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు అదనపు భవన సముదాయ ఆడిటోరియానికి ప్రమాణ స్వీకార కార్యక్రమం మార్పు చేశారు. ఈ ఘట్టాన్ని మొత్తం ప్రత్యక్ష ప్రసారం చేయడం ఒక చరిత్ర. సుప్రీంకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి ప్రత్యక్ష ప్రసారమైన జడ్జీల ప్రమాణ స్వీకార కార్యక్రమం.

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ వెంకటరామయ్య నాగరత్న, జస్టిస్ చుడలయిల్ తేవన్ రవికుమార్, జస్టిస్ M.M. సుంద్రేష్, జస్టిస్ బేలా మాధుర్య త్రివేది, జస్టిస్ పమిడిఘఠం శ్రీ నర్సింహ కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రమాణ స్వీకారం చేశారు.

ఆగస్టు 17 న తొమ్మిది పేర్లను సుప్రీం న్యాయమూర్తులుగా ఈ తొమ్మిదిగురుని సీజేఐ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు చేసిన సిఫార్సులను ఆగస్టు 26న రాష్ట్రపతి ఆమోదించారు. ఈ తొమ్మిది మంది న్యాయమూర్తుల ప్రమాణస్వీకారంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కి పెరిగింది.

 

Read also: KTR: సెప్టెంబర్ 2న జరిగే పార్టీ జెండా పండగ అదిరిపోవాలి.. వీడియో కాన్ఫెరెన్స్‌లో కేటీఆర్ దిశా నిర్దేశం