కొత్త పెళ్లి జంట… ఆదర్శానికి పూనుకునెనంట… పర్యావరణ పరిరక్షణకు కదిలెనంట… సమాజమూ స్పందించెనంట…

| Edited By:

Dec 08, 2020 | 8:54 PM

ఆరేళ్ల అనుబంధాన్ని ఏడడుగుల వరకు తీసుకెళ్లారు... ప్రేమను గెలుపిస్తూ... పెళ్లిపీటలెక్కారు... వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు... అయితే ప్రేమకు వేదికైన ప్రాంతానికెళ్లారు... మనసు చివుకుమంది... అంతే అందరికీ ఆదర్శమయ్యే పని చేశారు... అదేంటో మీరే చదివేయండీ....

కొత్త పెళ్లి జంట... ఆదర్శానికి పూనుకునెనంట... పర్యావరణ పరిరక్షణకు కదిలెనంట... సమాజమూ స్పందించెనంట...
Follow us on

Newlywed couple skip honeymoon, clear 600 kg of waste from beach ఆరేళ్ల అనుబంధాన్ని ఏడడుగుల వరకు తీసుకెళ్లారు… ప్రేమను గెలుపిస్తూ… పెళ్లిపీటలెక్కారు… వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు… అయితే ప్రేమకు వేదికైన ప్రాంతానికెళ్లారు… మనసు చివుకుమంది… అంతే అందరికీ ఆదర్శమయ్యే పని చేశారు… అదేంటో మీరే చదివేయండీ….

కర్నాటక‌కు చెందిన అనుదీప్, మినుషా ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు. డిసెంబర్ 18న పెద్దల సమక్షంలో వైభవంగా పెళ్లి చేసుకున్నారు. అయితే ప్రేమలో ఉన్నప్పుడు అనుదీప్, మినుషా తరచు సోమేశ్వర బీచ్‌లో కలిసేవారు. కరోనా నేపథ్యంలో ఇంటి దగ్గరే ఉంటున్న నవ దంపతులు వారి ప్రేమకు నెలవైన సోమేశ్వర బీచ్‌ను బాగు చేయాలని అనుకున్నారు. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 5 వరకు బీచ్‌లో ఉన్న చెత్తను ఏరారు. దాదాపు 600 కిలోల చెత్తను బీచ్‌ వెంబడి తిరుగుతూ ఏరివేశారు. కాగా, అనుదీప్, మినుషా చేస్తున్న పనికి స్థానికులు స్పందించారు. వారితో పాటు చెత్తను ఏరారు. అనుదీప్ మాట్లాడుతూ… బీచ్ పరిరక్షణ కోసం వీలు చిక్కినప్పుడల్లా చెత్తను ఏరివేస్తానని అన్నాడు.