New Delhi Railway Station Stampede: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట వెనుక అసలు కారణం ఇదేనట..! రైల్వే కూలీ చెప్పిన అసలు నిజం..?

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించారు. ఈ సంఘటనకు సంబంధించిన అనేక షాకింగ్ వీడియోలు బయటకు వస్తున్నాయి. మరోవైపు రైల్వే శాఖ నిర్వహణ తీరు, నిర్లక్ష్యం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్‌లో రద్దీగా ఎక్కువగా ఉండటం వల్లే తొక్కిసలాట జరిగిందని చెప్పగా, ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న ఒక రైల్వే కూలీ ప్రమాదం వెనుక అసలు కారణాన్ని చెప్పారు.

New Delhi Railway Station Stampede: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట వెనుక అసలు కారణం ఇదేనట..! రైల్వే కూలీ చెప్పిన అసలు నిజం..?
Railway Station Stampede

Updated on: Feb 16, 2025 | 1:59 PM

రైల్వే స్టేషన్‌లో పనిచేస్తున్న ఒక పోర్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం జరిగిన తీరును వివరించాడు. తాను 1981 నుండి ఇక్కడే కూలీగా పనిచేస్తున్నాను.. కానీ, గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున జనసమూహాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు. ప్రయాగ్‌రాజ్ స్పెషల్ 12వ నంబర్ ప్లాట్‌ఫామ్ నుండి బయలుదేరాల్సి ఉంది. కానీ, సడెన్‌గా ఆ ట్రైన్‌ ఆ ప్లాట్‌ఫామ్ 16వ నంబర్‌కు మార్చబడింది. దాంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ప్లాట్‌ఫామ్ 16 వైపు పరిగెత్తడం ప్రారంభించారు. దీని కారణంగా రెండు వైపుల నుండి వచ్చిన జనాలు ఒకరినొకరు ఢీకొంటూ తొక్కుకుంటూ తోసుకున్నారని చెప్పాడు.  ప్రయాణికులు ఎస్కలేటర్లు, మెట్లపై పడిపోయారని కూలీ వివరించారు.

ఈ ఘటనలోనే చాలా మంది చనిపోయారు. మేము చనిపోయిన వారిని అంబులెన్స్‌ వద్దకు తీసుకెళ్లాము. ప్లాట్‌ఫారమ్‌పై బూట్లు, బట్టలు చెల్లా చెదురుగా పడిపోవటం చూసి చలించిపోయామని చెప్పారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. 3-4 అంబులెన్స్‌లు అక్కడికి చేరుకున్నాయి. ఆ తర్వాత ప్రజలను ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

రాత్రి తొక్కిసలాట చూసిన తర్వాత ఉదయం వరకు తాను ఎలాంటి ఆహారం తినలేకపోయానంటూ అతడు బాధగా చెప్పాడు. మూడు గంటల పాటు అక్కడి కూలీలంతా పోలీసుల కంటే ముందుగా స్పందించి ప్రజలకు సహాయం చేశామని చెప్పాడు. సమాచారం అందిన వెంటనే ఫైర్‌ సెఫ్టీ స్టేషన్‌లో అగ్నిప్రమాదంగా భావించి..మూడు ఫైర్‌ ఇంజిన్లను పంపించారని చెప్పాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.