
జంతర్‌మంతర్‌లో వేడివేడిగా బొద్దింక, కేంద్ర కేబినెట్‌లో కూల్‌కూల్‌గా విద్యా మంత్రి ధర్మేంద్ర..! ఎవరికివాళ్లు కొండెక్కి కూర్చుని ఇష్యూను ఇజ్జత్‌కా సవాల్‌గా మార్చేశారు. రెండు వైపులా హర్టయిన ఇగోలు బ్యాలెన్స్ అయ్యేదాకా ఈ పీటముడి వీడిపోతుందన్న నమ్మకాలైతే లేవు. కానీ, బొద్దింకకు, ధర్మేంద్రకు మధ్య పెద్దచిక్కు ప్రశ్నగా మారిన నీట్ గురించైతే దేశమంతటా మరోసారి లోతైన చర్చ మొదలైంది. మరోసారి అని ఎందుకన్నామంటే.. నీట్ గురించి మాట్టాడుకోవడాలు కాదు కొట్లాడుకోవడాలే జరిగాయి గతంలో చాలాసార్లు. బీజేపీయేతర రాష్ట్రాలు కేంద్రంలో మోదీ సర్కార్‌తో ఢీ అంటే ఢీ అన్నాయి. ఇప్పుడు కాక్రోచ్‌ల సందట్లో సడేమియా అన్నట్టు నీట్ రచ్చ నీటుగా మళ్లీ షురూ ఐందా? వైద్య విద్యలో అడ్మిషన్ల ప్రక్రియను ఎప్పుడో చేతుల్లోకి తీసుకున్నందుకు ఇప్పుడు ఆకులు పట్టుకుంటోంది కేంద్రంలో మోదీ సర్కార్. నిన్నటి దాకా నీట్‌కి వ్యతిరేకంగా పోరాడి పోరాడి అలసిపోయిన రాష్ట్రాలకు మళ్లీ ఊపునిచ్చింది జంతర్‌మంతర్‌లో కాక్రోచ్‌ల ఉద్యమం. విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేబినెట్ కలుగులోంచి బైటికొస్తాడా రాడా అనేది అటుంచేద్దాం. ఇప్పటికైతే సెంటరాఫ్ కాంట్రవర్సీ ఐన నీట్ భవిష్యత్తు మీదే నీళ్లు జల్లేస్తున్నాయి కొన్ని పార్టీలు. నీట్ పుట్టుకమీదే డౌట్లు పుట్టిస్తోంది లేటెస్ట్ పొలిటికల్ ట్రెండ్. విద్యార్థులకు పరీక్ష బరువు తగ్గించడం, మెడికల్ ఎడ్యుకేషన్ కమర్షియలైజ్...