BJP: ఆ ఖర్చులు పూడ్చుకునేందుకు వంటగ్యాస్ ధరలు పెంచారా.. బీజేపీ పై ఎన్సీపీ ఫైర్

ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచడాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఎన్సీపీ (NCP) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూల్చడానికి అయిన ఖర్చులను.. ఇలా ధరలు పెంచి ప్రజల నుంచి తీసుకుంటున్నారా అని

BJP: ఆ ఖర్చులు పూడ్చుకునేందుకు వంటగ్యాస్ ధరలు పెంచారా.. బీజేపీ పై ఎన్సీపీ ఫైర్
Mahesh Tapase
Follow us

|

Updated on: Jul 07, 2022 | 6:17 AM

ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచడాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఎన్సీపీ (NCP) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూల్చడానికి అయిన ఖర్చులను.. ఇలా ధరలు పెంచి ప్రజల నుంచి తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. అంతర్జాతీయ ధరల ప్రభావంతో వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.50 పెంచుతూ చమురు సంస్థలు బుధవారం ప్రకటించాయి. ఈ ధరల పెరుగుదలపై ఎన్సీపీ నేత మహేశ్ తపసె బీజేపీ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహా వికాస్‌ అఘాడీ కూటమి నుంచి 50 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు.. మహారాష్ట్రలో (Maharashtra) అధికారంలోకి రాగానే సిలిండర్‌ ధరపై రూ.50 పెంచారన్న అయన.. ఈ రెండింటిలోనూ యాభై ఉందని వివరించారు. 50 మంది రెబల్ ఎమ్మెల్యేల కోసం బీజేపీ బాగానే ఖర్చు చేసిందని అన్నారు. అలా మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం సద్దుమణిగాక ఇలా వంటగ్యాస్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. కాగా మహారాష్ట్రలో ఇంధన ధరలను తగ్గిస్తామని నూతన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే నిన్న అసెంబ్లీ వేదికగా చెప్పారని గుర్తు చేశారు. కానీ ఆ మరుసటి రోజే వంట గ్యాస్‌ ధరలు పెరిగాయని ఎద్దేవా చేశారు.

అయితే.. ఈ సంవత్సరంలో వంటగ్యాస్ ధరలు మే తర్వాత మూడు సార్లు పెరిగాయి. మే 7న రూ.యాభై, మే 19న రూ.3.50, పెంచాయి. ఇలా గతేడాది జూన్‌ నుంచి ఇప్పటివరకు చూస్తే సిలిండర్‌ ధర రూ.244 పెరిగింది. కాగా రాకెట్ వేగంతో దూసుకుపోతున్న ఇంధన ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం మే నెలలో పెట్రోల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ రూ.8, డీజిల్‌పై రూ.6 తగ్గించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..