Birthday Celebrations: ఇంట్లోనే పుట్టినరోజు వేడుకలు చేసుకున్న యువతి..ముంబయి పోలీసుల స్పెషల్ గిఫ్ట్..ట్విట్టర్ లో ట్రెండింగ్!

|

Apr 24, 2021 | 10:40 PM

ముంబయి పోలీసులు ఇటీవలి కాలంలో ఫ్రెండ్లీ పోలీస్ గా పేరు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ.. అందరితోనూ కలిసి మెలిసి పోతున్నారు.

Birthday Celebrations: ఇంట్లోనే పుట్టినరోజు వేడుకలు చేసుకున్న యువతి..ముంబయి పోలీసుల స్పెషల్ గిఫ్ట్..ట్విట్టర్ లో ట్రెండింగ్!
Mumbai Birthday
Follow us on

Birthday Celebrations:ముంబయి పోలీసులు ఇటీవలి కాలంలో ఫ్రెండ్లీ పోలీస్ గా పేరు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ.. అందరితోనూ కలిసి మెలిసి పోతున్నారు. చాలా సందర్భాల్లో వారు సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అయిపోతున్నారు. తాజాగా మరో సంఘటన ముంబాయి పోలీసుల ఫ్రెండ్లీ తీరును తెలియచేసింది. ఈసారి కూడా ముంబై పోలీసులు మరోసారి నెటిజన్ల హృదయాలను గెలుచుకున్నారు.

కరోనావైరస్ రెండో వేవ్ ఉధృతంగా ఉన్న వేళలో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి సమతా పాటిల్ తన స్నేహితులతో బయటకు వెళ్లడానికి నిరాకరించడంతో.. పోలీసులు ఆమెకు కేక్ పంపారని ఒక ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేశారు. ఆమె తన పోస్ట్‌లో ముంబై పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ విషయాన్ని వివరించింది. “నా పుట్టినరోజు అద్భుతంగా జరిపినందుకు ధన్యవాదాలు ముంబయి పోలీస్” అని సమతా పాటిల్ ట్వీట్ చేశారు. అంతకు ముందు

తన స్నేహితుడిని కలవాలనుకున్న ముంబైకర్‌ను ఇంట్లోనే ఉండమని ముంబై పోలీసులు ట్వీట్ చేశారు. తన స్నేహితులు పుట్టినరోజు పార్టీని అడుగుతున్నారని, అయితే లాక్డౌన్ లాంటి పరిస్థితి ఉన్నందున తాను ఉండలేనని ఆమె చెప్పింది అలాగే, ఇంట్లోనేసురక్షితంగా ఉండమని తన స్నేహితులకు సలహా ఇచ్చింది.

ముంబై పోలీసులు సమతాకు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె “బాధ్యతాయుతమైన ప్రవర్తన” పై “ప్రశంసల చిహ్నంగా” ఆమెతో మాట్లాడాలనుకుంటున్నట్లు పోలీసులు ఆమె వివరాలు మరియు చిరునామాను అడిగారు. ఆతరువాత సమతాకు ‘బాధ్యతాయుతమైన పౌరుడు’ అని చెబుతూ రాసిన రుచికరమైన చాక్లెట్ కేక్ పంపించారు. దీంతో సమతా మురిసిపోయారు. ముంబై పోలీసు కోట్ ఆమె ట్వీట్ చేశారు. అందులో “ఈ రోజు మీ‘ సురక్షితమైన ’వేడుక నగరాన్ని రేపు‘ సంతోషంగా ’తీసుకురావడానికి సహాయపడుతుంది. మీకు మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు! అని పోలీసులు పేర్కొన్నారు. ముంబాయి పోలీసులు సూపర్ కదా!
ఆ ట్వీట్ లు మీరూ చూసేయండి..


Also Read: Chasing Criminal: ముందు కారులో హంతకుడు.. వెనుక పోలీసులు.. సూపర్ ఛేజింగ్ సీన్.. ఇంతలో ఏమైందంటే..

Indonesia Sub Marine: ఆ జలాంతర్గామి కథ ముగిసినట్టే..అందులోని 53 మంది బ్రతికి ఉండటం కష్టమే..ఇండోనేషియా నేవీ చీఫ్ మార్గోనో!