Sakshi Singh Dhoni: ఝార్ఖండ్‌ సర్కారుపై డైనమైట్‌లా పేలిన ధోని సతీమణి.. విద్యుత్‌ కోతలపై వైరల్‌గా మారిన ట్వీట్‌..

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని సతీమణి సాక్షి సింగ్‌ ధోని (Sakshi Singh Dhoni) ఝార్ఖండ్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. రాష్ట్రంలో ఇంతలా విద్యుత్ సంక్షోభం ఎందుకుందంటూ సర్కారును నిలదీసింది

Sakshi Singh Dhoni: ఝార్ఖండ్‌ సర్కారుపై డైనమైట్‌లా పేలిన ధోని సతీమణి.. విద్యుత్‌ కోతలపై వైరల్‌గా మారిన ట్వీట్‌..
Ms Dhoni

Updated on: Apr 26, 2022 | 1:33 PM

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని సతీమణి సాక్షి సింగ్‌ ధోని (Sakshi Singh Dhoni) ఝార్ఖండ్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. రాష్ట్రంలో ఇంతలా విద్యుత్ సంక్షోభం ఎందుకుందంటూ సర్కారును నిలదీసింది. ఈ మేరకు ఝార్ఖండ్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సాక్షి చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది ‘ఒక ట్యాక్స్‌ పేయర్‌గా ఝార్ఖండ్‌ ప్రభుత్వానికి ప్రశ్న వేస్తున్నా. కొన్నేళ్ల నుంచి రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం ఇంతలా ఎందుకుందనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. బాధ్యత కలిగిన పౌరులుగా విద్యుత్ను ఆదా చేసేందుకు మేం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అయినా విద్యుత్ కోతలు ఎందుకు ఆగడంలేదు’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది సాక్షి. ప్రస్తుతం ఇక్కడ ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా (JMM) అధినేత హేమంత్‌ సోరెన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

కాగా ఝార్ఖండ్‌లో కొద్ది రోజులుగా చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏప్రిల్‌ 28 తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. ఇదే సమయంలో వేలాపాలా లేని విద్యుత్‌ కోతలు అక్కడి ప్రజలను మరింత కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. కాగా బొగ్గు కొరత ఎక్కువగా ఉండడంతో విద్యుత్ ప్లాంట్లలో విద్యుదుత్పత్తికి తీవ్ర ఆటంకం కలుగుతోంది. రాజధాని రాంచీ, జంషెడ్‌పూర్‌ నగరాల్లో మినహా అన్ని నగరాల్లో అప్రకటిత విద్యుత్‌ కోతలు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఝార్ఖండ్‌ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ట్వీట్ చేసింది సాక్షి. కాగా ఆమె ప్రస్తుతం తన కూతురుతో కలిసి రాంచీలోనే ఉంటున్నారు. మరోవైపు ధోని ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్కే)కు ప్రాతినిథ్యం వహిస్తూ బిజీగా ఉన్నాడు.

Also Read: 

Sarkaru Vaari Paata: దూసుకుపోతోన్న కళావతి సాంగ్.. యూట్యూబ్‌లో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన సర్కారు వారి పాట

మొహంపై మొటిమలు, మచ్చలతో బాధపడుతున్నారా..? అరటిపండ్లతో సింపుల్‌గా చెక్ పెట్టొచ్చు..

Jeevitha Rajasekhar: జీవిత రాజశేఖర్ నన్ను బెదిరిస్తోంది : జోస్టర్ ఫిల్మ్ మెంబర్ హేమ