
భారతదేశ గిరిజన కళా వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. గిరిజన కళ, సృజనాత్మక సహకారాల నూతన శకానికి మార్గం సుగమం చేస్తోంది. ఇందులో భాగంగా గిరిజన వారసత్వాన్ని పరిరక్షించడానికి,గిరిజన కళాకారులకు స్థిరమైన, ఆకాంక్షాత్మక జీవనోపాధిని కల్పించడానికి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంకల్పించింది. ఇందులో భాగంగా “రిసా, టైమ్‌లెస్ ట్రైబల్” – ఒక ప్రీమియం సిగ్నేచర్ బ్రాండ్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా గిరిజన నేత, ఎంబ్రాయిడరీ, చేతివృత్తులపై దృష్టి కేంద్రీకరించింది.
భారతదేశపు గొప్ప గిరిజన వారసత్వాన్ని ప్రపంచ ఫ్యాషన్, జీవనశైలిలో అగ్రస్థానానికి తీసుకురావాలని భావిస్తోంది. ఇందులో భాగంగా, గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరం, 18 మార్చి 2026 న న్యూఢిల్లీలోని సుందర్ నర్సరీలో “RISA: Timeless Tribal” అనే ఒక ప్రత్యేకమైన ప్రీమియం సిగ్నేచర్ బ్రాండ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జువల్ ఓరం మాట్లాడుతూ.. “గిరిజన కళలు శాశ్వతమైనవి, అయినప్పటికీ వాటికి తగిన విలువ లభించడం లేదు. భారత్ ట్రైబ్స్ ఫెస్ట్, రిసా వంటి వేదికలు ద్వారా మార్కెట్‌లోకి తీసుకువచ్చి మంచి లాభాలను సమానంగా పంచుకోవడం ద్వారా ఈ అంతరాన్ని పూడుస్తున్నాయి” అని గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరం అన్నారు.
సమ్మిళిత గిరిజన వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నిరంతర ప్రయత్నాలను సద్వినియోగం చేసుకోవాలని మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ అన్నారు. “వివిధ వేదికల ద్వారా ప్రభుత్వం ప్రతి దశలోనూ గిరిజన అభివృద్ధికి పాటుపడుతోంది. BTF, RISA వంటి కార్యక్రమాలు ఈ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయని, తద్వారా మార్కెట్ మెరుగుపరుస్తూ, ‘వోకల్ ఫర్ లోకల్’ దార్శనికతలో గిరిజన వర్గాలు పెద్ద పాత్ర పోషించేలా వీలు కల్పిస్తున్నాయని” ఆమె పేర్కొన్నారు.
ప్రీమియం సిగ్నేచర్ బ్రాండ్ అయిన ‘రిసా’, గిరిజన మగ్గాలు, చేతివృత్తుల సంప్రదాయాలను పరిరక్షించడం, అలాగే గిరిజన వస్త్రాలు, దుస్తులు, ఎంబ్రాయిడరీలు, హస్తకళల పట్ల వినియోగదారుల దృష్టిని ఆకర్షించేలా రూపొందిస్తున్నారు. వినియోగదారుల్లో ఆసక్తిని కలిగించడం అనే ఒక ఉన్నతమైన దార్శనికతతో ముందుకు సాగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గిరిజన ఉత్పత్తులకు ఒక ప్రత్యేకమైన బ్రాండ్ గుర్తింపును సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. తద్వారా భారతదేశంలోని గిరిజన వర్గాల క్లిష్టమైన హస్తకళా నైపుణ్యం, ప్రీమియం దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో తన సముచిత స్థానాన్ని పొందేలా కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ సంకల్పించింది. సాంప్రదాయ పద్ధతులు, సమకాలీన డిమాండ్ మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చడానికి రిసా రూపొందించడం జరిగిందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరం తెలిపారు.
కార్యక్రమాన్ని నిర్దేశించే లక్ష్యాలు:
రూపకల్పన జోక్యం: గిరిజన నేత పనులు, ఎంబ్రాయిడరీలు, హస్తకళల కోసం కొత్త డిజైన్లను రూపొందించడం. తదనంతరం కొత్త ఉత్పత్తులను తయారు చేయడం. ఇది హస్తకళల పునరుద్ధరణ, ఉత్పత్తి అభివృద్ధి, కళాకారుల ఏకీకరణ కోసం కొత్త డిజైన్లు, కొత్త మోడల్స్ పునరావృతమయ్యే చట్రాన్ని కూడా నిర్మిస్తుంది.
నైపుణ్యం పెంపు: అధిక విలువ గల మార్కెట్ల కోసం ఉన్నత స్థాయి ఉత్పత్తికి అవసరమైన నైపుణ్యాలను మెరుగుపరచడానికి, వారి ఆదాయంలో గణనీయమైన పెరుగుదలను నిర్ధారించడానికి గిరిజన నేత కార్మికులకు, చేతివృత్తి కళాకారులకు శిక్షణ, సామర్థ్య పెంపును అందించడం. ఇది గిరిజన వర్గాలను, ముఖ్యంగా మహిళలను ఆర్థికంగా, సామాజికంగా సాధికారత కల్పిస్తుంది.
మౌలిక సదుపాయాలు: గిరిజన నేత, చేతివృత్తుల క్లస్టర్ల అభివృద్ధి చేపట్టడం. ఇప్పటికే ఉన్న నేత క్లస్టర్లలో కుట్టు యూనిట్లను ఏర్పాటు చేయడం కూడా ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.
ప్రీమియం ప్యాకేజింగ్: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) హర్యానా, కస్టమ్-టైలర్డ్ విభాగానికి అనుగుణంగా సుస్థిరమైన, పర్యావరణ అనుకూలమైన ప్రీమియం ప్యాకేజింగ్‌ను అభివృద్ధి చేసింది.
నేషనల్ డిజైన్ సెంటర్ (NDC) నియమించిన ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్లతో వ్యూహాత్మక భాగస్వామ్యాల ఆధారంగా ఈ ఉత్పత్తి ఆవిష్కరణ జరుగుతోంది. అబు జానీ సందీప్ ఖోస్లా, మనీష్ త్రిపాఠి, అంజు మోడీ, గౌరవ్ జై గుప్తా, సమీరా దల్వి వంటి ప్రఖ్యాత డిజైనర్లు ఈ ప్రాజెక్ట్‌లో మంత్రిత్వ శాఖతో భాగస్వామ్యం వహిస్తున్నారు. రిసా ప్రారంభోత్సవపు మొదటి దశలో, భారతదేశంలోని అత్యంత విశిష్టమైన కొన్ని నేత వస్త్రాలు, చేతివృత్తుల ఎంపిక చేసిన సేకరణను ప్రదర్శిస్తున్నారు. అంతేకాకుండా, ఈ బ్రాండ్ లాంగ్‌పి కుండలు (మణిపూర్), తుర్టుక్ ఇత్తడి కత్తులు, చెంచాలు (లడఖ్), ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డోఖ్రా కళ (ఛత్తీస్‌గఢ్) వంటి ప్రత్యేకమైన హస్తకళలను కూడా ప్రదర్శిస్తున్నారు.
రిసా ఒక కీలకమైన సామాజిక-ఆర్థిక ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇది భారతదేశపు విశిష్ట సాంస్కృతిక చిహ్నాల పరిరక్షణలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించారు. ఇది గిరిజన ప్రాంతాల ఆర్థిక ఉన్నతిని ప్రోత్సహిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘వికసిత్ భారత్’ దార్శనికతకు అనుగుణంగా, ఈ కార్యక్రమం భారతదేశ వృద్ధిలో గిరిజన వర్గాల పాత్రను కీలక భాగస్వాములుగా బలోపేతం చేస్తుంది. ఇది సుస్థిర జీవనోపాధిని, విలువ పెంచుతూ, దేశీయ హస్తకళలకు ప్రపంచ గుర్తింపును ప్రోత్సహిస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..