
మహారాష్ట్రలో భాషా వివాదం మంటలు రేపుతోంది. మరాఠీ వర్సెస్ హిందీ ఫైట్ పీక్ స్టేజ్‌కు చేరుతోంది. మొన్నామధ్య మరాఠీ మాట్లాడలేదని మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు కొందరిపై దాడి చేస్తే.. రీసెంట్‌గా ముంబై లోకల్ ట్రైన్‌లో మరాఠీ భాష విషయంలో మహిళల మధ్య వార్ జరగడం మరింత హీట్ పెంచుతోంది. మహారాష్ట్రలో భాషా వివాదం చినికిచినికి గాలివానలా మారుతోంది. మహారాష్ట్రలో ఉండే వాళ్లంతా మరాఠీలో మాట్లాడాల్సిందేనన్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే కామెంట్స్‌తో భాషా వివాదం ముదురుతోంది. మరాఠాలపై హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. ఈ క్రమంలోనే.. మరాఠీ మాట్లాడలేదనే కారణంతో MNS కార్యకర్తలు పలువురిపై దాడులకు పాల్పడ్డ ఘటనలూ చోటుచేసుకున్నాయి.
అయితే.. మరాఠీ వర్సెస్ హిందీ ఫైట్.. ఇప్పుడు ముంబై లోకల్ ట్రైన్స్‌కి చేరింది. సీట్ల కోసం మొదలైన గొడవ.. మరాఠీ వర్సెస్ హిందీ వివాదానికి దారి తీసింది. ముంబైలో ఉండాలంటే మరాఠీ మాట్లాడాలి.. లేదంటే వెళ్లిపోవాలన్నారు మహారాష్ట్ర మహిళలు. రైలు బోగీలోని కొందరు మహిళలు ఒకరికొకరు మరాఠీ, హిందీ అంటూ గొడవకు దిగిన వీడియో వైరల్ అయింది.
భాషా వివాదం నేపథ్యంలో జరుగుతున్న దాడులు, మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరికలపై బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. తాము కూడా మరాఠాలపై దాడులు చేస్తామన్న బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే కామెంట్స్ కాకరేపాయి.
ఇక.. నిశికాంత్ దూబే వ్యాఖ్యలు మహారాష్ట్రలో మంటలు రాజేశాయి. దూబే కామెంట్స్‌పై MNS చీఫ్ రాజ్ ఠాక్రే ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ముంబై సభలో మాట్లాడిన ఆయన.. దూబే కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు.
మొత్తంగా.. మహారాష్ట్రలో మరాఠీ- హిందీ లాంగ్వేజ్ వార్ తారాస్థాయికి చేరుతోంది. ఈ భాషా యుద్ధం దాడులు, వివాదాలకు దారి తీస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.