ఏడాది పొడవునా మామిడి..! ఎండాకాలం వచ్చేంతవరకు వెయిట్ చేయనవసరం లేదు.. ఎలాగో తెలుసా..?

Mango Throughout The Year : దేశంలో మామిడి పండ్లకు ఉన్న క్రేజ్‌ ఏ పండ్లకు ఉండదు.. ఫ్రూట్స్‌లో రారాజుగా వెలుగొందుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా ఎంతో ఇష్టంగా

  • uppula Raju
  • Publish Date - 5:35 am, Wed, 7 April 21
ఏడాది పొడవునా మామిడి..! ఎండాకాలం వచ్చేంతవరకు వెయిట్ చేయనవసరం లేదు.. ఎలాగో తెలుసా..?
Mango

Mango Throughout The Year : దేశంలో మామిడి పండ్లకు ఉన్న క్రేజ్‌ ఏ పండ్లకు ఉండదు.. ఫ్రూట్స్‌లో రారాజుగా వెలుగొందుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా ఎంతో ఇష్టంగా మామిడి పండ్లను తింటారు. ప్రతి సంవత్సరం ఉగాది నుంచి మొదలయ్యే మామిడి జాతర దాదాపుగా వర్షాకాలం వరకు ఉంటుంది. అయితే ఇక నుంచి మామిడి పండ్ల కోసం ఎండాకాలం వచ్చేంతవరకు వెయిట్‌ చేయనవసరం లేదు. సంవత్సరం పొడవునా మీకిష్టమైన మామిడి పండ్లను తినవచ్చు. ఎలాగంటే రాజస్థాన్‌లోని కోటాకు చెందిన శ్రీకిషన్‌ సుమన్‌ అనే రైతు అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేశాడు.

సదాబహార్‌ (సతతహరితం) పేరుతో రూపొందించిన పొట్టి రకం మామిడిని కనుగొన్నాడు. ఇది సాధారణ తెగుళ్లు అన్నింటినీ తట్టుకుని ఏడాది పొడవునా కాపు ఇస్తుందని చెప్పాడు. ఉత్తర భారత్‌లో ఎక్కువగా లభించే లంగడా రకంతో పోలిస్తే ఈ పండు చాలా పొట్టిగా ఉంటుంది. పెరటి తోటల్లో, కుండీల్లో పెంచుకోవచ్చు. ముదురు కమలాపండు రంగులో కనిపించే దీని కండ భాగం చాలా తియ్యగా ఉంటుంది. పుష్కలమైన పోషకాలతో నిండిన ఈ మామిడి ఆరోగ్యానికి చాలా మంచిది.

రెండో తరగతితో చదువు ఆపేసిన శ్రీకిషన్‌ 2000 సంవత్సరంలో తన తోటలోని ఓ మామిడి మొక్క మిగతా వాటికంటే భిన్నంగా ఏడాది పొడవునా కాయలు కాయడాన్ని గమనించారు. దానికి అయిదు అంట్లు కట్టి కొత్త రకాలు అభివృద్ధి చేయడంపై దృష్టిసారించారు. అలా కట్టిన అంట్లను భద్రపరుస్తూ కొత్త రకం తయారుచేయడానికి ఆయనకు 15 ఏళ్లు పట్టింది. ఇలా అంటుకట్టిన మొక్క రెండో యేట నుంచే పండ్లు కాయడాన్ని గమనించారు.

సదాబహార్‌పై నమ్మకం కుదరడంతో ఆ మొక్కను రాష్ట్రపతి భవన్‌లోని మొగల్‌ గార్డెన్‌లో నాటడానికి నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ (ఎన్‌ఐఎఫ్‌) చొరవ తీసుకుంది. శ్రీకిషన్‌ సుమన్‌కు 9వ నేషనల్‌ గ్రాస్‌రూట్‌ ఇన్నోవేషన్, ట్రెడిషనల్‌ నాలెడ్జ్‌ అవార్డు ఇచ్చింది. ఈ కొత్త రకం మామిడి కోసం 2017-20 మధ్యకాలంలో 8వేల ఆర్డర్లు వచ్చాయి. 2018-20 మధ్యకాలంలో శ్రీకిషన్‌ దేశంలోని వివిధ రాష్ట్రాల రైతులకు 6వేల మొక్కలు సరఫరా చేశారు. కృషి విజ్ఞాన కేంద్రాలకు 500 మొక్కలు ఇచ్చారు.

పీపీఈ కిట్‌లో వచ్చి ఓటేసిన ఎంపీ కనిమొళి.. మీడియాకు విజయ సంకేతం చూపించి తిరిగి అంబులెన్స్‌లోకి..

Maoist letter: జవాన్‌ను విడిచిపెట్టేందుకు షరతులు.. లేఖ రాసిన మావోయిస్టులు..

Government Apps: ఈ 5 ప్రభుత్వ యాప్‌లు మీ మొబైల్‌లో ఉన్నాయా?.. వీటి ప్రాముఖ్యత ఏంటో తెలిస్తే వెంటనే డౌన్‌లోడ్ చేసుకుంటారు..