ఇది రైతు వ్యతిరేక, ప్రజా విరుద్ధమైన బడ్జెట్, బీజేపీపై నిప్పులు కక్కిన మమతా బెనర్జీ

కేంద్ర తాజా బడ్జెట్ పై బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నిప్పులు కక్కారు. ఈ బడ్జెట్లో పెట్రోలు, డీజిల్ ధరలను పెంచారని..,

ఇది రైతు వ్యతిరేక, ప్రజా విరుద్ధమైన బడ్జెట్, బీజేపీపై నిప్పులు కక్కిన మమతా బెనర్జీ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 01, 2021 | 6:06 PM

కేంద్ర తాజా బడ్జెట్ పై బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నిప్పులు కక్కారు. ఈ బడ్జెట్లో పెట్రోలు, డీజిల్ ధరలను పెంచారని,సెస్ కేంద్రానికి పోగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమీ మిగలదని ఆమె చెప్పారు. ఇది రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, యాంటీ కంట్రీ బడ్జెట్ అని మండిపడ్డారు. దీన్ని ఫేక్ బడ్జెట్ గా ఆమె అభివర్ణించారు. పెట్రోలు,  డీజిల్ ధరల వల్ల సామాన్యులు, ముఖ్యంగా రైతులు ఎంతో నష్టపోతారని, బీజేపీ సదా వీటి ధరలను పెంచడాన్ని పరిపాటిగా పెట్టుకుందని దీదీ పేర్కొన్నారు.

రైతులకు 15 లక్షలు ఇస్తామన్నారు కానీ ఆ వాగ్దానం నెరవేర్చారా అని ఆమె ప్రశ్నించారు. ఎన్నికల ముందు బెంగాల్ లో ఏడు టీ తోటలను రీఓపెన్ చేస్తామని హామీ ఇఛ్చారని, కానీ అది కూడా అమలుకు నోచుకోలేదన్నారు. కోల్ కతా -సిలిగురి రోడ్ తో ఏం బావుకుంటారు ? అస్సాంలో విమానాశ్రయాన్ని నిర్వహిస్తామని చెప్పారని, కానీ కూచ్ బిహారీ ఎయిర్ పోర్టును ఎందుకు నిర్వహించరని అన్నారు. మీరు చేయలేకపోతే మేం చేస్తాం అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రం నుంచి నేతలను ఢిల్లీకి తీసుకువెళ్లేందుకు అద్దెకు చార్థర్డ్ విమానాలను ఏర్పాటు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆమె దుయ్యబట్టారు. రైతు చట్టాలను రద్దు చేయకుండా గ్రామీణ రోడ్లను వేస్తామంటున్నారు.. మేం ఆ పని చేయలేమా అన్నారామె.

Read More:అమెరికాలో తెలుగు మహిళ అనుమానాస్పద మృతి.. చివరి చూపు కల్పించాలంటూ కుటుంబసభ్యులు ఆవేదన..