Sri Rama Navami: శ్రీరామ నవమి వేడుకల్లో ఊహించని ప్రమాదం.. మెట్లబావి కుప్పకూలి పడిపోయిన భక్తులు..

|

Mar 30, 2023 | 4:13 PM

జరిగిన దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సిఎం తో మాట్లాడి, పరిస్థితిపై ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం రెస్క్యూ, రిలీఫ్ పనులు ఏ ఆటంకం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. బాధిత కుటుంబీకులందరికీ సానుభూతి తెలుపుతూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

Sri Rama Navami: శ్రీరామ నవమి వేడుకల్లో ఊహించని ప్రమాదం.. మెట్లబావి కుప్పకూలి పడిపోయిన భక్తులు..
Indore Temple Collapse
Follow us on

శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నగర్‌ పెను ప్రమాదం సంభవించింది. స్నేహ నగర్‌ సమీపంలోని పటేల్‌ నగర్‌లో గల శ్రీ బేలేశ్వర్‌ మహాదేవ్‌ జులేలాల్‌ ఆయలంలోని మెట్లబావి కప్పు కుప్పకూలిపోవడంతో 25 మంది వరకు పడిపోయారు. ప్రమాదం జరిగిన తర్వాత చాలాసేపటి వరకు అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్, 108 వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బావిలో పడిన కొంతమందిని స్థానికులే ఎలాగోలా బయటకు తీశారు. వీధులు ఇరుకుగా ఉండడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిసింది. మరోవైపు ఇండోర్ మేయర్ పుష్యమిత్ర భార్గవతో సహా ఎంఐసీ సభ్యులందరూ ప్రమాద స్థలానికి వచ్చారు. సహాయక చర్యలను దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. మహిళలు, చిన్నారులు మెట్లబావిలో పడిపోయారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సమాచారం అందిందని, సహాయక చర్యలను వేగవంతం చేయాలని స్థానిక అధికారులను ఆదేశించినట్లు సీఎంవో కార్యాలయం తెలిపింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కార్యాలయం ఇండోర్ జిల్లా యంత్రాంగంతో నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంది. ఇండోర్ పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగం సంఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మెట్ల బావి నుంచి మొత్తం ఎనిమిది మందిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యల కోసం పోలీసులు, జిల్లా యంత్రాంగం, ఎస్‌డిఆర్‌ఎఫ్‌తో సహా పలు అంబులెన్స్‌లను మోహరించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

ఇండోర్‌లో జరిగిన దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సిఎం శివరాజ్ చౌహాన్‌తో మాట్లాడి, పరిస్థితిపై ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం రెస్క్యూ, రిలీఫ్ పనులు ఏ ఆటంకం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. బాధిత కుటుంబీకులందరికీ సానుభూతి తెలుపుతూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..