Watch: సిగ్గుండాలి.. పోలీస్ అధికారి ఇలాంటి పనులా చేసేది ?? వీడియో వైరల్ !!!

మధ్యప్రదేశ్‌లోని సియోనీ జిల్లాలో పోలీసులు చిక్కుల్లో పడ్డారు. ఓ వ్యక్తిని గంజాయి కేసులో ఇరికించేందుకు ఓ పోలీస్ అధికారి అతడి బ్యాగులో గంజాయి పెట్టాలని సూచిస్తున్నట్లు ఉన్న వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సైతం వైరల్‌గా మారడంతో పోలీస్ శాఖ అప్రమత్తమై విచారణకు ఆదేశించింది.

Watch: సిగ్గుండాలి.. పోలీస్ అధికారి ఇలాంటి పనులా చేసేది ?? వీడియో వైరల్ !!!
Madhya Pradesh Police

Updated on: Nov 18, 2026 | 12:54 PM

అధికారం అండతో అడ్డగోలుగా రెచ్చిపోతాం.. ఇష్టానుసారంగా కేసులు పెట్టేస్తాం అంటే చెల్లుబాటయ్యే రోజులు పోయాయి. మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో సామాన్యులకు కాస్త బలం చేకూరుతోంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ముఖ్యం.. వారికి సేవ చేసేందుకే ఉన్నామనే విషయాన్ని ఎంతో మంది ప్రభుత్వ అధికారులు కాలరాసిన సందర్భాలు ఉన్నాయి. అంతిమంగా అందుకు తగ్గ శిక్షను పొందిన ఘటనలను చూస్తూనే ఉంటున్నాం. అయితే కొందరు అధికారులు మాత్రం తమ ధోరణి మార్చుకోకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లేటెస్ట్‌గా ఖాకీ చొక్కా ఉందని రెచ్చిపోయారు ఓ పోలీస్ అధికారి. ఓ వ్యక్తిని గంజాయి కేసులో ఇరికించేందుకు అతడి బ్యాగులో గంజాయి పెట్టాలని సూచిస్తున్నట్లు ఉన్న వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది.

అసలేం జరిగిందంటే..

మధ్యప్రదేశ్‌లోని సియోనీ జిల్లాలో పోలీసులను ఇబ్బందుల్లోకి నెట్టే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు వీడియోలో హోటల్ సిబ్బందితో పోలీస్ అధికారి మాట్లాడుతూ.. ‘‘అతడి బ్యాగులో కొంత గంజాయి పెట్టండి’’ అని చెప్పడం గమనించవచ్చు. హోటల్ ప్రాంగణంలో నిషేధిత మాదకద్రవ్యాలను ఉంచి, సదరు వ్యక్తిపై డ్రగ్స్ కేసు నమోదు చేసేలా కుట్రకు తెరతీసినట్లు ఈ సంభాషణ ద్వారా తెలుస్తోంది. అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నది ఎవరు? అసలు ఈ సంభాషణ ఎప్పుడు జరిగింది? అనే విషయాలు ఇంకా స్పష్టతకు రావాల్సి ఉంది.

కాగా ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న సియోనీ జిల్లా ఎస్పీ కృష్ణ లాల్‌చందానీ.. కోత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జిని తక్షణమే పోలీస్ లైన్స్‌కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలానే ఘటనపై సమగ్ర విచారణకు కూడా ఆదేశించామని.. సంబంధిత అధికారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే ఈ వీడియో నిజమైనదేనా? అందులో వినిపిస్తున్న సంభాషణ ఎప్పుడు, ఏ సందర్భంలో జరిగింది? అనే అంశాలను నిర్ధారించేందుకు పోలీసులు హోటల్ సీసీటీవీ ఫుటేజీతో పాటు డీవీఆర్ వివరాలను పరిశీలించనున్నారు. దాంతో విచారణ పూర్తయిన తర్వాతే ఈ వ్యవహారంలో పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మరోవైపు ఈ ఘటనతో హోటళ్లలో పరస్పర అంగీకారంతో బస చేస్తున్న వయోజన జంటల వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత విషయంపై చర్చ నడుస్తుంది. హోటళ్లలో ఉంటున్న జంటల వ్యక్తిగత జీవితాల్లోకి పోలీసులు జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. చట్టం ప్రకారం.. 18 ఏళ్లు దాటిన ఇద్దరు వయోజనులు తమ ఇష్టప్రకారం, పరస్పర అంగీకారంతో, ఎలాంటి మోసం లేదా బలవంతం లేకుండా హోటల్ గదిలో కలిసి ఉంటే అది నేరం కాదు. కేవలం ఒక రాత్రి మాత్రమే కాకుండా.. ఇద్దరి సమ్మతి ఉంటే ఎక్కువ కాలం కూడా హోటల్ గదిలో కలిసి ఉండవచ్చని వెల్లడిస్తుంది. కేవలం ఈ కారణంతో పోలీసులు వారిని వేధిస్తే, సదరు జంట చట్టపరమైన సహాయం కోరవచ్చని అంటున్నారు.

MP పోలీసుల వైరల్ వీడియో..

Loading...
Unable to load recommendations.
Follow Us