Bhopal woman: నడిరోడ్డుపై దారుణం.. పండ్ల వ్యాపారిపై మహిళ వీరంగం.. సర్వత్రా విమర్శలు

|

Jan 12, 2022 | 1:38 PM

Bhopal woman: తోపుడు బండిపై పళ్లు అమ్ముకుంటూ పొట్ట పోసుకుంటున్న ఓ వ్యక్తిపై అపర కాళిలా విరుచుకుపడింది ఓ మహిళ. పళ్లబండిపై ఉన్న పళ్లన్నింటినీ నేలపాలు చేసింది. నా పొట్ట కొట్టొద్దని..

Bhopal woman: నడిరోడ్డుపై దారుణం.. పండ్ల వ్యాపారిపై మహిళ వీరంగం.. సర్వత్రా విమర్శలు
Bhopal Women
Follow us on

Bhopal woman: తోపుడు బండిపై పళ్లు అమ్ముకుంటూ పొట్ట పోసుకుంటున్న ఓ వ్యక్తిపై అపర కాళిలా విరుచుకుపడింది ఓ మహిళ. పళ్లబండిపై ఉన్న పళ్లన్నింటినీ నేలపాలు చేసింది. నా పొట్ట కొట్టొద్దని అతను ఎంత బ్రతిమాలినా వినిపించుకోలేదు. రోడ్డుపై అందరూ చూస్తుండగా… పండ్ల బండి నుంచి పండ్లను ఒక్కొక్కటిగా తీసి రోడ్డుకేసి కొట్టారు. మధ్యప్రదేశ్.. భోపాల్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే..

మధ్యప్రదేశ్‌ భోపాల్ లోని అయోధ్య బైపాస్ ఏరియాలో ఆమె కారుకి అనుకోకుండా… పండ్ల వ్యాపారి బండి తగిలింది. దాని వల్ల ఆ కారుకు కొద్దిగా గీతలు పడ్డాయి. అంతే ఆమె అగ్గిమీద గుగ్గిలం అయిపోయింది. అతనిపై తీవ్రంగా మండిపడుతూ… రెచ్చిపోయింది. అతను సారీ చెబుతూ… పరిహారంగా డబ్బు ఇస్తానని చెప్పినా ఆమె వినలేదు. చివరకు అతని బండిపై పండ్లు అన్నింటినీ నేలపాలు చేసి… బండిని కూడా పక్కకు పడేసి పోయింది. ఆమె కారు వెనక సేజ్ యూనివర్శీటీ అని రాసివుంది. అంటే ఆమె ఆ యూనివర్శిటీ కి చెందిన ప్రొఫెసర్‌ కావచ్చు.. అది భోపాల్‌లో పేరున్న యూనివర్శిటీ. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమె తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. పొరపాట్లు జరగడం సహజం. కారుకు గీతలు పడితే ఆ ప్రొఫెసర్‌కి కలిగే నష్టం తక్కువే… కానీ ఆమె ఇలా చెయ్యడం వల్ల అతను ఆర్థికంగా కోలుకోలేని పరిస్థితి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “ఆమె ప్రొఫెసరా బెగ్గరా” అని ఓ నెటిజన్ మండిపడగా… “ఇది తప్పే. ఆ పండ్ల వ్యాపారి పొట్టకొట్టారు. అతనికి న్యాయం చెయ్యాలి” అని మరో యూజర్ అంటే..”ఆమె మహిళను అనే ఉద్దేశంతో అడ్వాంటేజ్ తీసుకుంది” అని మరో యూజర్ కామెంట్‌ చేశారు.

 

Also Read:

 ఏపీకి వాతావరణ సూచన.. మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు..

యువతలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ప్రజాస్వామ్యంపై స్పృహ ఉండాలిః ప్రధాని మోడీ