LPG leak: గ్యాస్‌ సిలిండర్‌ పేలితే రూ.5 లక్షల వరకు పరిహారం పొందవచ్చు.. ఎలాగంటే?

|

Dec 12, 2022 | 8:55 AM

ఒక్కోసారి గ్యాస్ సిలిండర్ ప్రమాదవశాత్తూ పేలి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. సిలిండర్‌ పేలితే ఎల్‌పీజీ కంపెనీ నష్ట పరిహారం చెల్లిస్తుందని మీకు తెలుసా? అవును..

1 / 5
కట్టెల పొయ్యిపై వంట చేసే రోజులు పోయాయని చెప్పాలి. పల్లె, పట్టణ తేడాలేకుండా సర్వత్రా గృహిణులు ఎల్పీజీ సిలిండర్‌తో వంట చేస్తున్నారు. ఐతే ఒక్కోసారి గ్యాస్ సిలిండర్ ప్రమాదవశాత్తూ పేలి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. సిలిండర్‌ పేలితే ఎల్‌పీజీ కంపెనీ నష్ట పరిహారం చెల్లిస్తుందని మీకు తెలుసా? అవును.. అసలు ఇటువంటి పాలసీ ఒకటుందని చాలా మందికి తెలియదు.

2 / 5
ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ తీసుకునే సమయంలో కస్టమర్లందరికీ గ్యాస్‌ కంపెనీ బీమా చేస్తుంది. దీనిని ఎల్పీజీ బీమా కవర్ పాలసీ అంటారు. ప్రమాదవశాత్తు సిలిండర్ లీకేజీ లేదా పేలుడు సంభవిస్తే.. నష్టాన్ని బట్టి పరిహారం చెల్లించబడుతుంది.

3 / 5
ఎల్పీజీ కంపెనీ నుంచి ప్రతి వినియోగదారుడికి 50 లక్షల రూపాయల వరకు బీమా ఉంటుంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల కుటుంబ సభ్యులెవరైనా గాయపడినా లేదా ఆస్తి నష్టం జరిగినా రూ.40 లక్షల వరకు పరిహారం పొందవచ్చు.

4 / 5
పేలుడు వల్ల ప్రాణనష్టం జరిగితే రూ.50 లక్షల వరకు పరిహారం పొందవచ్చు. గ్యాస్‌ సిలిండర్‌ పేలుళ్లలో ప్రాణ నష్టం జరగకపోయినా, ఆస్తినష్టం జరిగితే రూ.2 లక్షల పరిహారం పొందవచ్చు.

5 / 5
ఎల్పీజీ కంపెనీ బీమా పరిహారం పొందాలంటే ఓ షరతు ఉంది. అందేంటంటే.. ఎల్పీజీ సిలిండర్‌ ఎవరి పేరు మీద ఉంటుందో వారికి మాత్రమే బీమా డబ్బు చెల్లిస్తారు. ఈ బీమాకు నామినీ సౌకర్యం లేనందున.. సదరు కస్టమర్ కుటుంబంలో మరెవరూ బీమా పరిహారం అందుకోలేరు.