Spearfishing: చేపలు పట్టడంలో ఈ యువకుడు మహా దిట్ట.. ఫిషింగ్‌ ఎంత ఈజీనో మీరే చూడండి..

| Edited By: Janardhan Veluru

Dec 23, 2022 | 12:19 PM

ఇతను చేపలు పట్టడానికి వలలు, గాలాలు ఉపయోగించడు. ఇతను చేపలను వేటాడే ఆయుధం ఓ గన్‌. గన్‌తోనే అతను చేపలు పడుతుంటాడు. నీటి లోపల పేల్చడానికి వాడే స్పియర్‌ గన్‌ సాయంతో శిబు చేపలను పట్టుకుంటాడు.

Spearfishing: చేపలు పట్టడంలో ఈ యువకుడు మహా దిట్ట.. ఫిషింగ్‌ ఎంత ఈజీనో మీరే చూడండి..
Shibu Joseph
Follow us on

చేపలు పట్టడానికి ఎవరైనా ఫిష్ రాడ్ లేదా వలలను ఉపయోగిస్తారు. అయితే ఈ యువకుడు తాను అందరికంటే భిన్నంగా ఉండాలని భావించాడు.. అందుకనే చేపలను పట్టడంలో స్పియర్ గన్స్ ఉపయోగిస్తూ.. భిన్నమైన పద్దతులను పాటిస్తూ.. తన స్పెషాలిటీని చాటుకున్నాడు.. కేరళకు చెందిన యువకుడు. కేరళలోని కొల్లాంకు చెందిన శిబు జోసెఫ్‌ డైవింగ్‌లో మంచి నైపుణ్యం సంపాదించాడు. అంతేకాదు అతను చేపలు పట్టడం కూడా వినూత్నంగా ఉంటుంది. అందులో తనకు తానే సాటి అన్నట్టుగా విభిన్న పద్ధతిలో చేపలు పడుతూ ప్రత్యేకత చాటుకుంటున్నాడు. ఇతను చేపలు పట్టడానికి వలలు, గాలాలు ఉపయోగించడు. ఇతను చేపలను వేటాడే ఆయుధం ఓ గన్‌. గన్‌తోనే అతను చేపలు పడుతుంటాడు. నీటి లోపల పేల్చడానికి వాడే స్పియర్‌ గన్‌ సాయంతో శిబు చేపలను పట్టుకుంటాడు. తలకు కెమెరా ధరించి సముద్ర జలాల్లోకి దూకుతాడు.

అక్కడ కనిపించే రకరకాల చేపలను స్పియర్‌ గన్‌తో వేటాడుతూ, కెమెరాతో షూట్‌ చేస్తుంటాడు. ఆ వీడియోలను యూట్యూబ్‌ చానల్‌లో పోస్టు చేస్తుంటాడు. తాజాగా అతను చేపలు పడుతున్నప్పుడు తీసిన ఫోటోలను నెట్టింట పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

వీటిని నెటిజన్లు బాగా ఇష్టపడుతున్నారు. అయితే శిబు నెటిజన్లకు ఓ సూచన చేస్తున్నాడు. నిపుణుల దగ్గర శిక్షణ తీసుకోకుండా ఎవరూ ఇలాంటి సాహసాలు చేయొద్దని కోరుతున్నాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..