PFI-NIA, ED Raids: తల పాక్‌.. తోక సిమి.. PFI అసలు రంగు ఇదేనా?.. కరోనా టైమ్‌లో కరాటే ముసుగులో..

PFI activists in AP, Telangana: క్లూ లాగితే లింకుల డొంకలు కదిలాయి. కరోనా టైమ్‌లో గుంపులుగా గుంపులు వచ్చి..PFI నీడలో కరాటే శిక్షణ పేరిట సీక్రెట్‌గా టెర్రర్‌ రిక్రూట్‌ నిర్వహిస్తోన్న వైనం కంటపడ్డంతో .. NIA ఇలా వెంటపడింది..

PFI-NIA, ED Raids: తల పాక్‌.. తోక సిమి.. PFI అసలు రంగు ఇదేనా?.. కరోనా టైమ్‌లో కరాటే ముసుగులో..
Pfi
Follow us

|

Updated on: Sep 23, 2022 | 7:56 PM

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చరిత్రలోనే నెవర్‌ బిఫోర్‌ బిగ్‌ సెర్చ్ ఆపరేషన్. కశ్మీర్‌ టు కన్యాకుమారి వరకు ఏకంగా 15 రాష్ట్రాల్లో 93 ప్రదేశాల్లో ఏకకాలంలో తనిఖీలు.. అరెస్టులు.. PFI ఆఫీసుల సీజ్‌.. నిరసనగా కేరళలో భగ్గుమన్న ఆందోళనలు. అయితే తెలుగు రాష్ట్రాల్లోనూ.. తనిఖీలు.. సీజ్‌లు.. అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. అసలేం జరుగుతోంది..? PFI కథా కమామిషు ఏంటి..? NIA ఈ స్థాయిలో ఫోకస్‌ చేయడం వెనుక మర్మమేంటి..? పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా.. PFI నిషేధిత ఉగ్రవాద సంస్థకు డమ్మీనా..? కుబుసం విడిచిన సిమి, కరాటే ముసుగులో టెర్రర్‌ రిక్రూట్‌మెంట్‌కు పాల్పడుతోందా..? పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా నీడలో సంఘ విద్రోహ కార్యక్రమాలకు పాల్పడుతున్నారనే పక్కా సమాచారంతో NIA.. మూడో కన్ను తెరిచింది. ఉగ్రవాద కదలికలు, టెర్రర్‌ ఫండింగ్‌పై ఉక్కుపాదం మోపుతోంది. అందులో భాగమే సర్జికల్‌ సెర్చింగ్స్‌.

అసలు PFI ఏంటి..?

పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా.. PFI 2006లో ఏర్పాటైన ఇస్టామిస్ట్‌ అతివాద సంస్థ. నిషేధిత సిమీ సంస్థకు చెందిన సభ్యులు సిమి సభ్యులు పీఎఫ్ఐ లో వున్నట్టు ఎన్‌ఐఏ గుర్తించింది. సిమి సభ్యుడు ప్రొఫెసర్ కోయా పీఎఫ్ఐలో క్రియాశీలంగా ఉండటంతో అనుమానాలకు బలం చేకూరింది. ప్రధాని నరేంద్ర మోదీ బీహార్‌ పర్యటన జులై 12న సందర్భంగా పీఎఫ్‌ఐ కుట్ర లింకులు తెరపైకి వచ్చాయి. నిషేధిత ఇస్లామిక్ అతివాద సంస్థ.. స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా- సిమి- కోసం పనిచేసిన వారితో.. ఒక రహస్య సంస్థను ఏర్పాటు చేసేందుకు పీఎఫ్ఐ ప్రయత్నిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. రెండు వాట్సాప్ గ్రూప్‌ల్లో మెసేజ్‌లకు సంబంధించి ఈ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక గ్రూప్‌తో పాకిస్తాన్, యెమెన్ మరికొన్ని గల్ఫ్ దేశాలతోనూ సంబంధాలున్నాయి. మరో గ్రూప్‌లో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు చెందిన ఎనిమిది మంది సభ్యులున్నట్లు ఎంక్వైరీలో తేలింది.

కరోనా టైమ్‌లో కరాటే ముసుగులో..

క్లూ లాగితే లింకుల డొంకలు కదిలాయి. కరోనా టైమ్‌లో గుంపులుగా గుంపులు వచ్చి..PFI నీడలో కరాటే శిక్షణ పేరిట సీక్రెట్‌గా టెర్రర్‌ రిక్రూట్‌ నిర్వహిస్తోన్న వైనం కంటపడ్డంతో .. NIA ఇలా వెంటపడింది. స్వచ్చంద సంస్థ ముసుగులో విరాళాలు ..కరాటే ముసుగులో ఉగ్రశిక్షణ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎన్‌ఐఏ, ఈడీ సంయుక్తంగా పీఎఫ్‌ఐ కార్యాలయాలు, సభ్యుల ఇళ్లపై దాడులు చేపట్టాయి. కట్‌ చేస్తే.. నిజామాబాద్‌ను టచ్‌ చేస్తే … తెలుగు రాష్ట్రాల్లో PFI లింకులు బయటపడ్డాయి. నిజామాబాద్‌లో కరాటే మాస్టార్‌ అబ్దుల్‌ ఖాదర్ అరెస్ట్‌తో ఉగ్ర శిక్షణ తెరపైకి వచ్చింది. పీఎఫ్‌ఐ లీడర్ల ఆదేశాలతో ఆయన కరాటే ముసుగులో తన ఇంటినే టెర్రర్‌ ట్రెయినింగ్‌ సెంటర్‌గా మార్చినట్టు తేలింది. దర్యాప్తులో అతనిచ్చిన వివరాల ఆధారంగా దేశవ్యాప్తంగా NIA తనిఖీల పర్వం ఊపందుకంది.

నిజామాబాద్ అడ్డాగా చైన్‌ బ్రేకింగ్‌ ఆపరేషన్‌ 

నిజామాబాద్ అడ్డాగా పాపులర్ ప్రంట్ అప్ ఇండియా కార్య‌క‌లపాలు కొనసాగిస్తున్నట్టు ఎన్‌ఐఏ గుర్తించింది. మెరుపు తనిఖీల్లో పలువుర్ని అరెస్ట్‌ చేయడం సహా కీలక డేటాను సేకరించాయి ఎన్‌ఐఏ టీమ్స్‌. NIA చేపట్టిన PFI చైన్‌ బ్రేకింగ్‌ ఆపరేషన్‌ ఆపరేషన్‌ ఇటు నిజామాబాద్‌ ,బోధన్‌, కోరుట్ల, మెట్‌పల్లి, అసిఫాబాద్‌ సహా అటు కర్నూలు, నంద్యాల, కడప, గుంటూరులో ప్రకంపనలు రేపుతోంది.

కేరళలో బంద్‌ కాల్‌ అలజడి..

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు వెల్లడైన నేపథ్యంలో.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇదే క్రమంలో దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ తనిఖీలను ముమ్మరం చేసింది. నిరసనగా పీఎఫ్‌ఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కేరళలో బంద్‌ కాల్‌ అలజడి రేపింది. ఢిల్లీ, హైదరాబాద్‌, కోల్‌కతా , బెంగళూరు సహా అనేక ప్రాంతాల్లో పీఎఫ్‌ఐ ఆఫీసులను సీజ్‌ చేశాయి ఎన్‌ఐ ఏ టీమ్స్‌. హార్డ్‌డిస్క్, పెన్‌డ్రైవ్‌, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఓవైపు తనిఖీల జోరు ..మరోవైపు నిరసనల హోరు.

తెలుగు రాష్ట్రాల్లో 40 ప్రాంతాల్లో దాడులు

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే పీఎఫ్‌ఐకి సంబంధించిన 40 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు నిర్వహించింది. ఈ క్రమంలోనే ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో.. గుంటూరులో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో కర్నూలు, గుంటూరులోనూ సోదాలు చేశారు. కర్నూల్‌లోని ఖడక్‌పూర్‌ వీధిలో SDPI నాయకుడి ఇంట్లో తనిఖీలు చేశారు.

పొలిటికల్‌ సంగతి ఎలా వున్నా.. నిజామాబాద్‌ అడ్డాగా పీఎఫ్‌ఐ ఆపరేషన్స్‌ కొనసాగుతున్నట్టు ఎన్‌ఐఏ గుర్తించింది. నిజామాబాద్‌లోని 23 ప్రాంతాల్లో, సోదాలు నిర్వహించారు. టెర్రర్‌ సాహిత్యం, డాక్యుమెంట్లు, డిజిటల్‌ రూపంలో ఉన్న మెటీరియల్ ఏన్ఐఏ స్వాదినం చేసుకుంది.. తమకు ఉగ్రవాద సంస్థలతో సంబంధంలేదంటోన్న పీఎఫ్‌ఐవి గాలి మాటలేనని .. నిజామాబాద్‌ అడ్డాగా టెర్రర్‌ ట్రైనింగ్‌ నిర్వహిస్తన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు స్థానికులు

పీఎఫ్‌ఐను బ్యాన్‌ చేయాలని పలు ముస్లిమ్‌ సంఘాల డిమాండ్‌ తెరపైకి వచ్చింది.PFIతో పాటు దానితో సంబంధం ఉన్న అన్ని సంస్థలను బ్యాన్ చేయాలంటోంది ఆల్ ఇండియా సూఫీ సజ్జదానాధిన్ కౌన్సెల్‌. దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ తనఖీలు తోవ చూపింది నిజామాబాద్‌. ఇక్కడ దొరికిన సమాచారం ఆధారంగానే నేషన్‌ వైడ్‌ ఉచ్చు బిగించింది ఎన్‌ఐఏ. తల పాక్‌.. తోక సిమి.. అనేలా పీఎఫ్‌ఐ అసలు రంగబయటపట్టే ఆధారాలు చిక్కాయి.మొత్త‌నికి మెరుపు తనిఖీల్లో నిజామాబాద్ జిల్లాలో అల‌జ‌డి రేగింది. ఇందురుకు ఉగ్ర మరక లేకుండా టెర్రర్‌ లింకులను వానిష్‌ చేయాలనే డిమాండ్‌ ఊపందుకుంది.

మరిన్ని జాతీయ వార్తాల కోసం