Viral Video: కన్నడ నాట వెలుగులోకి మరో రాసలీల వ్యవహారం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

Viral Video: కర్ణాటకలో మరో రాసలీల వీడియో వెలుగులోకి వచ్చింది. అయితే ఈసారి గ్రామస్థాయి నాయకుడు అడ్డంగా బుక్కయ్యాడు.

Viral Video: కన్నడ నాట వెలుగులోకి మరో రాసలీల వ్యవహారం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
Scandal

Edited By: Team Veegam

Updated on: Apr 07, 2021 | 6:51 PM

Viral Video: కర్ణాటకలో మరో రాసలీల వీడియో వెలుగులోకి వచ్చింది. అయితే ఈసారి గ్రామస్థాయి నాయకుడు అడ్డంగా బుక్కయ్యాడు. ఓ గ్రామ పంచాయతీ సభ్యుడు, అదే గ్రామ పంచాయతీకి చెందిన ఆశా వర్కర్‌తో రాసలీలు నెరుపుతూ సీసీ కెమెరాకు పట్టుబడ్డారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాకు ఎక్కడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. అసలు వివరాల్లోకెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లా ఇండి తాలూకాలో తాంబ్రా గ్రామ పంచాయతీ ఉంది. ఆ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ ఆస్పత్రి కూడా ఉంది. అయితే, తాంబ్రా పంచాయతీ సభ్యుడు ఒకరు ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆశా వర్కర్‌తో పాడుపనులు చేశాడు. వారి వ్యవహారం అంతా ఆస్పత్రిలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అది కాస్తా వైరల్‌గా మారింది. ఇప్పటికే ఇలాంటి వరుస ఘటనలతో అట్టుడుకిపోతున్న కన్నడ నాట.. వీరి వ్యవహారం కూడా వైరల్ అవడంతో జిల్లా అధికారులు ఫైర్ అయ్యారు. ఆశా వర్కర్, గ్రామ పంచాయతీ సభ్యుడిపై చర్యలకు ఉపక్రమించారు.

కాగా, కన్నడ నాట మాజీ మంత్రి రమేష్ జార్కి హోళి రాసలీల వ్యవహారం.. ఓ ఊపు ఊపిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆ రచ్చ నడుస్తూనే ఉంది. బాధిత యువతి విడతల వారీగా విడుదల చేస్తున్న సీడీలతో కర్ణాటకలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇలాంటి సందర్భంలో వీరి వ్యవహారం బయటపడంతో నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. గతంలో రాష్ట్ర చట్టసభల్లోనే ప్రజాప్రతినిధులు బ్లూఫిలిమ్స్‌ చూసిన ఘటనలూ ఉన్నాయి. వాటన్నింటినీ ఉటంకిస్తూ విపరీతమై కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Also read: Telangana High Court: న్యాయవాద దంపతులు వామన్ రావు, నాగమణి హత్య కేసుపై హైకోర్టులో విచారణ.. మే 17 నాటికి సమగ్ర ఛార్జ్‌షీట్..

YS Vijayamma : వైఎస్‌ షర్మిల తెలంగాణ కొత్త పార్టీకి విజయమ్మ వెన్నుదన్ను, తల్లి సెంట్రిక్‌ గానే ఖమ్మం సంకల్ప సభ.! ఇదే రూట్ మ్యాప్

నితిన్ కు జోడీగా హైబ్రిడ్‌ పిల్లతో.. ఈ యంగ్ హీరోతో కలిసి మరోసారి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసినా..?

కేంద్రం సంచలన నిర్ణయం.. ఇకపై వర్క్ ప్లేస్‌లలోనూ కోవిడ్ వ్యాక్సినేషన్‌కు అనుమతి.!