Uttarakhand: జోషీమఠ్ కుంగుబాటుకు కారణమదేనా? IIRS రిపోర్ట్‌‌లో ఏముంది? ప్రభుత్వం ఏం చేస్తోంది?

|

Jan 12, 2023 | 9:41 AM

ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ టౌన్ ఏటా ఆరున్నర సెంటీమీటర్లు భూమిలోకి కుంగిపోతోందని మరో కొత్త నివేదిక వెలువడింది. జోషిమఠ్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా కుంగిపోతున్నాయని

Uttarakhand: జోషీమఠ్ కుంగుబాటుకు కారణమదేనా? IIRS రిపోర్ట్‌‌లో ఏముంది? ప్రభుత్వం ఏం చేస్తోంది?
Joshimath Uttarakhand
Follow us on

ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ టౌన్ ఏటా ఆరున్నర సెంటీమీటర్లు భూమిలోకి కుంగిపోతోందని మరో కొత్త నివేదిక వెలువడింది. జోషిమఠ్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా కుంగిపోతున్నాయని ఈ రిపోర్ట్ లో తేలింది. రెండేళ్ల పాటు జరిగిన పరిశోధనలో ఉపగ్రహ చిత్రాలను పరిశీలించి ఈ విషయాన్ని తెలుసుకున్నట్టు చెబుతున్నారు.. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ పరిశోధకులు. టెక్టానిక్ ప్లేట్ల కదలికల్లో మార్పుల వల్లే జోషిమఠ్ ప్రాంతం కుంగిపోతోందని అంటున్నారీ సైంటిస్టులు. దీంతో ఇళ్లు, రోడ్లు సహా ఇతర కట్టడాలకు పగుళ్లు వస్తున్నాయని అంటున్నారు.

జులై 2020 నుంచి మార్చి 2022 వరకు జోషిమఠ్ ఏరియాకు చెందిన ఉపగ్రహ చిత్రాలను నిశితంగా పరిశీలించి ఈ విషయాన్ని కనుగొన్నట్లు చెబుతున్నారు. జోషిమఠ్ లో పగుళ్లు వచ్చిన పలు ఇళ్లు, హోటళ్లను కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రమాదకరంగా మారిన పలు కట్టడాలను నిపుణుల బృందం గుర్తించింది. కూల్చివేయాల్సిన నిర్మాణాలకు క్రాస్ మార్క్ చేసింది. వాటి కూల్చివేత పనులు కూడా వెంటనే చేపట్టాల్సి ఉండగా.. స్థానికుల ఆందోళనలతో అధికారులు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. జోషిమఠ్ లో ప్రస్తుతం సుమారు 700 లకు పైగా కుటుంబాల వారు నిరాశ్రయులుగా మారారని అంటున్నారు అధికారులు.

జోషిమఠ్ లో పరిస్థితిపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ, స్థానికంగా స్టోన్ క్రషింగ్ పనులు మాత్రం ఆగడంలేదు. జోషిమఠ్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతంలో నిర్మాణ పనులపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఇప్పటికే చేపట్టిన పనులను సైతం ఆపేయాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలనూ పట్టించుకోకుండా ఇక్కడింకా పనులు కొనసాగడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..