Om Birla: జంప్ జిలానీలపై చర్యలు లేనట్టేనా..? లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఏమన్నారంటే..

Lok Sabha Speaker Om Birla: పార్లమెంటులో జంప్ జిలానీలపై చర్యలు లేనట్టేనా? అంటే లేదనే పరోక్షంగా సంకేతాలిచ్చారు.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరోపార్టీలో

Om Birla: జంప్ జిలానీలపై చర్యలు లేనట్టేనా..? లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఏమన్నారంటే..
Om Birla
Follow us

|

Updated on: Nov 15, 2021 | 6:03 PM

Lok Sabha Speaker Om Birla: పార్లమెంటులో జంప్ జిలానీలపై చర్యలు లేనట్టేనా? అంటే లేదనే పరోక్షంగా సంకేతాలిచ్చారు.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరోపార్టీలో చేరుతున్న ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోడానికి చట్టంలో ఎక్కడా నిర్ణీత కాలపరిమితి లేదని ఆయన స్పష్టంచేశారు. పైగా తమ దగ్గరికొచ్చే పార్టీ ఫిరాయింపుల పిటిషన్లు, కోర్టులో కేసులు ఒకటేనని, కోర్టులో కేసుల పరిష్కారానికి కాలపరిమితి లేనట్టే తమ దగ్గరికొచ్చే పిటిషన్ల పరిష్కారానికి కూడా కాలపరిమితి లేదని ఓం బిర్లా వ్యాఖ్యానించారు. అయితే డెహ్రాడూన్‌లో జరిగిన సభాపతుల సదస్సులో ఈ ఫిరాయింపుల అంశం చర్చకొచ్చిందని, నిర్ణీత కాలవ్యవధిలోగా ఫిరాయింపుల ఫిర్యాదులను పరిష్కరించేలా చట్ట సవరణలు అవసరమని పలు రాష్ట్రాలకు చెందిన సభాపతులు అభిప్రాయపడ్డారని ఓం బిర్లా తెలిపారు. ఈ క్రమంలో తాము పార్టీ ఫిరాయింపుల చట్టంలో అవసరమైన సవరణలను సూచించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ సిమ్లా సదస్సులో నివేదికను సమర్పిస్తుందని తెలిపారు. కమిటీ చేసే సూచనలు, సిఫార్సులను కేంద్రానికి తెలియజేస్తామని, అంతిమంగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటులో బిల్లు పెట్టాల్సి ఉంటుందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీలుగా గెలిచి, భారతీయ జనతా పార్టీలో చేరిన ఇద్దరు ఎంపీల వ్యవహారంపై స్పీకర్ ఓం బిర్లాకు టీఎంసీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్దరిలో ఒకరు మళ్లీ తిరిగి వెనక్కి వెళ్లిపోగా, మరొకరు ఆపార్టీలోనే కొనసాగుతున్నారు. సొంత పార్టీ బీజేపీలో చేరిన ఆ టీఎంసీ ఎంపీపై అనర్హత వేటు వేయలేని నిస్సహాయతలో స్పీకర్ ఉన్నారంటూ పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ విషయం నేరుగా, సూటిగా చెప్పలేక, డొంకతిరుగుడుగా చట్టంలో లొసుగులను సాకు చూపుతుండటం గమనార్హం.

కొనసాగుతున్న.. ఎంపీ రఘురామకృష్ణ వ్యవహారం.. నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణ రాజు వైపీసీ పార్టీ ఫిరాయించారన్న ఫిర్యాదు కాకపోయినా, పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదు ఉంది. వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా, స్పీకర్ కార్యాలయం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనిపై స్పీకర్ ఓంబిర్లాను టీవీ9 ఢిల్లీ బ్యూరో ప్రతినిధి మహాత్మ కొడియార్ ప్రశ్నించగా.. తమకందిన ఫిర్యాదుపై రఘురామ నుంచి వివరణ కోరామని, దానికాయన బదులిచ్చారని తెలిపారు. తాము మరో దఫా నోటీసు పంపించామని, దానికి ఆయన నుంచి బదులు రావాల్సి ఉందని తెలిపారు. ఫిర్యాదులపై ఎలాంటి విచారణ జరపకుండా చర్యలు తీసుకోలేమని, విచారణలో భాగంగా ఉత్తరప్రత్యుత్తరాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇలా మొత్తంగా రఘురామకృష్ణ రాజు ఫిర్యాదు కూడా సాగుతూ ఉంది. అయితే.. ఆయన పదవీకాలం పూర్తయ్యే వరకు కూడా పరిష్కారానికి నోచుకునేలా కనిపించడం లేదంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.

మహాత్మ కొడియార్, టీవీ9 తెలుగు, ఢిల్లీ బ్యూరో

Also Read:

టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు