Unique Village in India: మన దేశంలో ఈ గ్రామం ప్రత్యేకం.. రెండు దేశాల పౌరసత్వం.. గ్రామ పెద్దకు 60 భార్యలు..

|

Nov 10, 2022 | 12:00 PM

భారతదేశంలో 6 లక్షలకు పైగా గ్రామాలు ఉన్నాయి. అయితే దేశంలో ఒక గ్రామం రెండు దేశాలకు చెందిందిగా ఉంది. ఈ గ్రామంలోని ప్రజలు తిండి ఒక దేశంలో.. నిద్ర ఒక దేశంలో అన్నట్లుగా రెండు దేశాలుగా విభజించబడింది. ఈ గ్రామానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇక్కడి అధినేతకు ఒకరిద్దరు కాదు మొత్తం 60 మంది భార్యలు.

1 / 5
దేశంలో పట్టణీకరణ రోజు రోజుకీ పెరుగుతున్నప్పటికీ, నేటికీ దేశంలోని అత్యధిక జనాభా గ్రామాల్లోనే నివసిస్తున్నారు. ఒక నివేదిక ప్రకారం భారతదేశంలో 6 లక్షలకు పైగా గ్రామాలు ఉన్నాయి. అయితే దేశంలో రెండు దేశాలుగా విడిపోయిన ఒక గ్రామం కూడా ఉందని మీకు తెలుసా. ఈ గ్రామానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ గ్రామం గురించి తెలుసుకుందాం...

2 / 5
ఈ గ్రామం పేరు లాంగ్వా, ఇది నాగాలాండ్‌లో ఉంది, అయితే ఈ గ్రామానికి చెందిన అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇందులో ఒక భాగం భారతదేశంలో.. మరొక భాగం మయన్మార్‌లో ఉంది. అందుకే ఆ ఊరి ప్రజలకు రెండు దేశాల పౌరసత్వం వచ్చింది. మయన్మార్‌లో ఎలాంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా సంచరించవచ్చు.

3 / 5
లాంగ్వా గ్రామ పెద్ద ఇంటి మధ్య నుంచి అంతర్జాతీయ సరిహద్దు వెళుతుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ లాంగ్వా గ్రామ ప్రజలు ఒక దేశంలో తింటే.. మరొక దేశంలో నిద్ర పోతున్నారని అంటున్నారు.

4 / 5
ఈ గ్రామాధికారిని 'అంగ' అని పిలుస్తారు. నిజానికి.. అతను ఇక్కడ వంశపారంపర్య పాలకుడు. మీడియా కథనాల ప్రకారం.. లాంగ్వా గ్రామాన్ని మాత్రమే కాదు.. అతని పాలన భారతదేశం, మయన్మార్‌లో ఉన్న దాదాపు 70 గ్రామాల్లో నడుస్తుంది.

5 / 5
ఊరి పెద్దకు ఒకరో ఇద్దరో కాదు మొత్తం 60 మంది భార్యలున్నారు. అంటే అతను 60 పెళ్లిళ్లు చేసుకున్నాడని అంటారు. ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రజలు కొన్యాక్ తెగ నుండి వచ్చారు. ఈ తెగను గతంలో హెడ్‌హంటర్ తెగ అని పిలిచేవారని తెలుస్తోంది.