17 వేల అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

పట్నా నుంచి లక్నోకు వెళ్తున్న విమానాన్ని సుమారు 17 వేల అడుగుల ఎత్తులో పిడుగు బలంగా తాకింది. ఈ ఘటనతో విమానం ముందు భాగం కొంత మేర దెబ్బతింది. పరిస్థితిని గుర్తించిన పైలట్‌ అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని లక్నో విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. బుధవారం పట్నా నుంచి..

17 వేల అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Indigo Flight Struck By Lightning

Updated on: Oct 08, 2026 | 8:05 AM

లక్నో, అక్టోబర్ 8: గగనతలంలో ప్రయాణిస్తున్న ఇండిగో విమానానికి ఆకస్మిక ప్రమాదం ఎదురైంది. పట్నా నుంచి లక్నోకు వెళ్తున్న విమానాన్ని సుమారు 17 వేల అడుగుల ఎత్తులో పిడుగు బలంగా తాకింది. ఈ ఘటనతో విమానం ముందు భాగం కొంత మేర దెబ్బతింది. పరిస్థితిని గుర్తించిన పైలట్‌ అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని లక్నో విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. బుధవారం పట్నా నుంచి లక్నోకు ఇండిగో విమానం బయలుదేరింది. ప్రయాణంలో భాగంగా విమానం సుమారు 17 వేల అడుగుల ఎత్తులో ఉండగా ఒక్కసారిగా పిడుగు తాకింది. దీంతో విమానం ముందు భాగం కొంత వరకు లోపలికి చొచ్చుకుపోయినట్లు సమాచారం. ఈ పరిణామంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది.

పిడుగుపాటు తర్వాత విమాన పరిస్థితిని పైలట్‌ పరిశీలించారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతరం విమానాన్ని లక్నో విమానాశ్రయానికి మళ్లించి సురక్షితంగా ల్యాండింగ్‌ చేశారు. దీంతో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో విమానంలో మొత్తం 110 మంది ఉన్నారు. ఇందులో 104 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్‌ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విమానానికి పిడుగు తాకడంతో ముందు భాగం దెబ్బతినడంపై సంబంధిత అధికారులు పరిశీలన చేపట్టే అవకాశం ఉంది. విమానానికి జరిగిన నష్టం, పిడుగుపాటు ప్రభావం, ప్రయాణికుల భద్రతకు సంబంధించిన అంశాలను అధికారులు పరిశీలించనున్నారు.

ఇవి కూడా చదవండి

విమానాలు పిడుగుపాటును తట్టుకునేలా రూపొందించినప్పటికీ, ఇలాంటి ఘటనలు అరుదుగా విమాన కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తుంటాయి. ఈ ఘటనలో పైలట్‌ అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్‌ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

Loading...
Unable to load recommendations.
Follow Us