
India Coronavirus Updates: భారత్‌లో కరోనావైరస్ కేసులు భారీగా తుగ్గుముఖం పట్టాయి. కరోనా థర్డ్‌వేవ్ అనంతరం ఇటీవల రోజువారి కేసుల సంఖ్య 20 వేలకు దిగువన నమోదవుతోంది. ఈ క్రమంలో మంగళవారం భారీగా పెరిగిన కరోనా కేసులు (Coronavirus) బుధవారం స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో (బుధవారం) దేశవ్యాప్తంగా 14,148 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 302 మంది మరణించారు. నిన్నటితోపోల్చుకుంటే.. 954 కేసులు తగ్గాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 1.22 శాతంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో ప్రస్తుతం 1,48,359 (0.35%) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల 4,28,81,179 కి పెరగగా.. ఇప్పటివరకు కరోనాతో 5,12,924 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారని కేంద్రం వెల్లడించింది.
కాగా.. నిన్న కరోనా (Covid-19) మహమ్మారి నుంచి 30,009 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,22,19,896 కి చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.46 శాతంగా ఉంది. ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 176.52 కోట్ల టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
కాగా.. నిన్న దేశవ్యాప్తంగా 11,55,147 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి ఇప్పటివరకు 76.35 కోట్ల పరీక్షలు చేశారు.
Also Read: