India Corona: భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం.. రికార్డ్ స్థాయిలో నమోదైన పాజిటీవ్ కేసులు.. భారీగా పెరిగిన మరణాలు..

|

Apr 18, 2021 | 9:49 AM

India Corona: భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా రికార్డ్ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దేశ..

India Corona: భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం.. రికార్డ్ స్థాయిలో నమోదైన పాజిటీవ్ కేసులు.. భారీగా పెరిగిన మరణాలు..
Follow us on

India Corona: భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా రికార్డ్ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 2,60,810 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అంతకు ముందు రోజు 2.34 లక్షల కేసులు నమోదు అయ్యాయి. అంటే ఒక్క రోజు వ్యవధిలోనే 11.5 శాతం కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో రోజూ మరణాల సంఖ్య కూగా భయానక రీతిలో పెరిగింది. శనివారం నాడు ఒక్క రోజే.. 1,493 మంది కరోనా కారణంగా బలైపోయారు. గత అక్టోబర్ 2వ తేదీ తరువాత తొలిసారి కరోనాలు ఇంతటి భారీ స్థాయిలో నమోదు అవడం ఇదే తొలిసారి. దేశంలో మరణాల రేటు 1.2శాతంగా ఉంది. ప్రస్తుతం యాక్టీవ్ కేసులు 18 లక్షలకు పైగా ఉన్నాయి. ఇది మరింత ఆందోళన కలిగిస్తోంది. రికవరీ రేట్ తగ్గి.. యాక్టీవ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో ఆస్పత్రులు సరిపోవడం లేదు. దాంతో కరోనా బాధితులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.

ఇదిలాఉంటే.. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 67,123 పాజిటివ్ కేసులు నమోదు అవగా.. ఢిల్లీలో 24,375 కేసులు నమోదు అయ్యాయి. కర్ణాటక-17,489, ఛత్తీస్‌గడ్-16,083, కేరళ-13,835, మధ్యప్రదేశ్ -11,269, గుజరాత్-9,541, తమిళనాడు-9,344, రాజస్థాన్-9,046, బిహార్-7,870, హర్యానా-7,717, బెంగాల్-7713, పంజాబ్-4,498 చొప్పున భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరణాలు సైతం ఈ రాష్ట్రాల్లో భారీగానే నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో ఒక్క రోజులు 419 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో-167, ఛత్తీస్‌గఢ్-158 మంది చనిపోయారు. ఇక యూపీలో 120 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

మరోవైపు ప్రపంచ వ్యాప్తంగానూ కరోనా వీరవిహారం చేస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 13.99 కోట్ల మంది కరోనా బారిన పడగా.. దాదాపు 30 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

Also read:

హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వినూత్న ఆలోచన… డ్రైవ్‌ చేసుకుంటూ ఇంటికెళ్లేందుకు లగ్జరీ కార్లు ఏర్పాటు

RBI Auction: ఆర్బీఐ కీలక నిర్ణయం… రూ. 14వేల కోట్ల ప్రభుత్వ సెక్యూరిటీ వేలం రద్దు… అధిక ధరలకు అమ్మాలని ట్రేడర్ల డిమాండ్‌